21న కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్?

The second list of Congress candidates is ready,The second list of Congress,Congress candidates is ready,second list of Congress candidates,Mango News,Mango News Telugu,Congress second list of candidates,Congress releases first list,Telangana Assembly elections,Congress Second List Announcement,Congress, congress candidates list, Revanth Reddy, Telangana Assembly Elections,Assembly Elections Latest News,Assembly Elections Latest Updates,Telangana Politics Latest News,Telangana Politics Latest Updates,Congress Second List Announcement Latest News
congress, congress candidates list, telangana assembly elections, revanth reddy,

తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ జోష్‌లో ఉంది. కొత్త ఊపుతో దూసుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మొన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తలామునకలయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించేసింది. 55 మంది మందితో తొలిజాబితాను రిలీజ్ చేసింది. అయితే ఈ జాబితాపై కొంత నెగిటివిటీ రావడంతో.. రెండో జాబితా విషయంలో అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఎలా ఉండబోతోంది?.. ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

అయితే అభ్యర్థుల రెండో జాబితాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. దాదాపు రెండో లిస్ట్ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో.. అంటే అక్టోబర్ 21న రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నేటి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగానలో పర్యటించనున్నారు. వారు రాష్ట్రంలో ఉన్నప్పుడే సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని నేతలు భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్ మొదటి జాబితాలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దగా ప్రధాన్యత ఇవ్వలేదు. దీంతో వారికి రెండో లిస్ట్‌లో ప్రధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది,

ఇకపోతే కాంగ్రెస్ మొదటి జాబితా వచ్చిన సమయంలో. . రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలు చేశారు. టికెట్లను అమ్ము కున్నారని.. తన అనుచరులకు మాత్రమే టికెట్ ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు ఏకంగా గాంధీ భవన్ వద్ద నిరసన కూడా తెలియజేశారు. కేవలం రేవంత్ రెడ్డి అనుచరులన్న ఒకే ఒక్క కారణంతో.. కొన్ని నియోజకవర్గాల్లో ఏమాత్రం తెలియని వ్యక్తులకు టికెట్ ఇచ్చారని కొందరు ఆరోపణలు చేశారు.

అంతకముందు బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై ఇవే విమర్శలు చేశారు. నోటుకు టికెట్ అమ్ముకుంటున్నారని కొందరు పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపిస్తే.. మరికొందరు మాత్రం బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ రెండో లిస్ట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =