నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండల్లో వరుసగా ఐటీ హబ్‌లు ప్రారంభం: మంత్రి కేటీఆర్

IT Hubs at Nizamabad Mahabubnagar Nalgonda Siddipet Starts Soon Minister KTR,IT hubs in Nizamabad,IT hubs in Mahbubnagar,IT hubs in Nalgonda,IT hubs in Siddipet respectively,Minister KTR,Mango News,Mango News Telugu,,Minister KTR DAIFUKU Investement,DAIFUKU Investement In Telangana,Minister KTR Bosch Investement,Bosch Investement In Telangana,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,TPCC President Revanth Reddy

రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం వరుస ట్వీట్స్ చేశారు. 3డీ మంత్ర (డిజిటైజ్, డీకార్బోనైజ్ మరియు డిసెంట్రలైజ్)లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో ఐటీ హబ్‌లు ప్రారంభమై విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఇక త్వరలో వరుసగా నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ మరియు ఆదిలాబాద్‌లలో ఐటీ హబ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి దాదాపు సిద్ధమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐ లీడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను తీసుకురావడంలో మహేష్ బిగాలతో పాటు నిరంతరం కృషి చేస్తున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్ ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి దాదాపు నెల రోజుల సమయం ఉందని, ఇందుకోసం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చాలా కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించడంతో సిద్దిపేట ఐటీ హబ్ కూడా బాగా రూపుదిద్దుకుంటోందని, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లో ఐటీ హబ్స్ ప్రారంభమైన కొన్ని నెలల తర్వాత సిద్దిపేట ఐటీ హబ్ కూడా ప్రారంభం కానుందన్నారు. ఇక నల్గొండ ఐటీ హబ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉందని, 4-6 నెలల్లో త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 5 =