హైదరాబాద్ లో బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

IT Minister KTR Inaugurates Bosch Global Software Technologies Smart Campus in Hyderabad,IT Minister KTR,Bosch Global Software Technologies,Bosch Global Software,Mango News,Mango News Telugu,Bosch Smart Campus,Bosch Smart Campus in Hyderabad,Bosch Smart Campus Hyderabad,Hyderabad Bosch Smart Campus,Minister KTR Bosch Investement,Bosch Investement In Telangana,Bosch Latest News and Updates,Bosch Smart Campus Unit in Hyderabad,Bosch Manufacturing Unit,Bosch Hyderabad,Minister KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో బాష్ సాఫ్ట్‌వేర్ స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన 1.5 లక్షల చదరపు అడుగుల స్మార్ట్ క్యాంపస్‌ సౌకర్యం ద్వారా 3,000 మందికి పైగా ఉపాధి కల్పించనున్నారని, అలాగే ఆటోమోటివ్ ఇంజినీరింగ్ డొమైన్‌లో బాష్ తన ఉనికిని బలోపేతం చేసుకుంటుందని తెలిపారు. “బాష్ యొక్క కొత్త క్యాంపస్ తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ మరియు ఆవిష్కరణ ఎకో సిస్టమ్ కు నిదర్శనం. టెక్ కంపెనీలకు ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రా అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించడం వలన హైదరాబాద్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన టెక్ సిటీగా తీర్చిదిద్దేందుకు వివిధ కార్పొరేషన్లను ఆకర్షించింది” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఐటీఈ అండ్ సీ డిపార్ట్‌మెంట్ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి, బాష్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య, బీజీఎస్‌డబ్ల్యూ సీఈఓ & ఎండీ దత్తాత్రి సలగామే, హైదరాబాద్ బీజీఎస్‌డబ్ల్యూ సెంటర్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ కిరణ్ సుందర రామన్, తదితరులు పాల్గొన్నారు.

ముందుగా గత ఫిబ్రవరిలో జర్మనీకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ, మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ హైదరాబాద్ లో తమ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ స్మార్ట్ క్యాంపస్‌ సదుపాయాన్ని నేడు ప్రారంభించారన్నారు. ఇంతకుముందు 3,000 మందికి ఉపాధి కల్పించాలని భావించారని, కానీ అది మరింత పెరుగుతుందని తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా బాష్ సంస్థ బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =