తెలంగాణలో కొత్తగా 2,391 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్.. ప్రకటించిన మంత్రి హ‌రీశ్‌ రావు

Minister Harish Rao Announces State Finance Department Gives Green Signal For 2391 Govt Posts in Telangana,Minister Harish Rao Announces,State Finance Department,Green Signal For 2391 Govt Posts,Govt Posts Telangana,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2023,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2023,Telangana Govt Notifications 2023

తెలంగాణలో గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా వెలువడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా 2,391 ఉద్యోగాల భ‌ర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. శుక్రవారం ఆయన దీనిని గురించి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక ఈ పోస్టుల్లో.. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుండగా.. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చ‌ర‌ర్స్ 480, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అలాగే స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో 166 ఖాళీలను పూరించనున్నారు. కాగా ఈ పోస్టుల‌ భ‌ర్తీని టీఎస్‌పీఎస్సీ, మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబా పూలే గురుకుల‌ విద్యాసంస్థ చేపట్టనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here