రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గం – బండి సంజయ్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Fires on Telangana BJP Chief Bandi Sanjay Over SSC Exam Paper Leak Issue,Minister Harish Rao Fires on Telangana BJP Chief,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay Over SSC Exam Paper Leak Issue,Mango News,Mango News Telugu,Minister Harish Rao Slams Bandi Sanjay,Minister KTR Tweet About Bandi Sanjay,Harish Rao Demands Bandis Disqualification,Disqualify Sanjay From Lok Sabha,BRS Demands Disqualification of BJP MP,SSC students at lurch as bundle Missing,Telangana Govt Calls For Report After SSC Exam,SSC Exams Answer Sheets Bundle Missing,Minister Harish Rao Latest News,BJP Chief Bandi Sanjay News Today

రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమని, తన స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గతరాత్రి అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డ మంత్రి హరీశ్‌ రావు, బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా? పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని, అంతేకానీ ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో అడ్డుకోవద్దని సూచించారు.

పదో తరగతి పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇక ఈ పేపర్‌ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి ప్రశాంత్‌ బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడని ఆరోపించిన ఆయన, పేపర్‌ లీకేజీకి పాల్పడిన వ్యక్తి మీ పార్టీ కార్యకర్త కాకపోతే, అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్‌ చేశారు? అని ప్రశ్నించారు. నిందితుడు ప్రశాంత్ 2 గంటల్లో 142 సార్లు మాట్లాడాడని, ఈ క్రమంలో పలుమార్లు బండి సంజయ్‌కు కూడా కాల్ చేసి మాట్లాడాడని, ఇది నిజమా? కాదా? అనేది బీజేపీ నేతలే చెప్పాలని ఆయన అన్నారు. వారే పథకం ప్రకారం ఒకవైపు పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడుతూ, మరోవైపు దాన్ని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ.. రాజకీయంగా తమ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ పేపర్‌ లీకేజీ ఒక్కటే కాదని, గతంలో కూడా బీజేపీ అనేక కుట్రలు పన్నిందని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించారని, బీజేపీని ప్రశ్నిస్తే, ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులిచ్చి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. మనం భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలి కానీ.. మన రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదో తరగతి పిల్లలకు, తల్లిదండ్రులకు ఎక్కడా ప్రశ్నపత్రం లీకవ్వలేదని, దీనివెనుక బీజేపీ ఉందని, ఇదంతా రాష్ట్ర, దేశ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టాలని, మంచిగా చదివి పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =