వచ్చే ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు రూపంలో వైసీపీకి పటిష్ట యంత్రాంగం ఉంది – సీఎం జగన్

CM Jagan Held Key Meeting with YSRCP Regional Coordinators To Direct Next Elections,CM Jagan Held Key Meeting,Meeting with YSRCP Regional Coordinators,CM Jagan Key Meeting To Direct Next Elections,Mango News,Mango News Telugu,2Strengthen YSR Congress For Polls,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra pradesh Politics

ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే వ్యవధి ఉందని, తనతో పాటు పార్టీ యంత్రాంగం కూడా శాయశక్తులా కృషి చేస్తే విజయం సాధించగలమని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పార్టీ పరంగా మీరందరూ నా టాప్ టీమ్. పార్టీకి సంబంధించిన అంశాలపై మీరు నన్ను ఎప్పుడైనా కలవొచ్చు. మీకు నిర్దేశించిన జిల్లాల్లో ముఖ్యమైన నేతలందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. పార్టీ మీపై పెట్టిన ఈ బాధ్యతను సమర్ధంగా నెరవేర్చాలి’ అని పేర్కొన్నారు.

సమావేశంలో ఇంకా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ‘ఈ క్రమంలో ఎక్కడైనా ఏవైనా లోటుపాట్లు గమనిస్తే సరిచేసుకుని అందరినీ ఒక్క తాటిపై నిలపాలి. తద్వారా వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులకు మంచి మెజారిటీ రావాలి. ప్రతిపక్షాలు మనపై చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సవివరంగా తెలియజేయాలి. ఇక ఎన్నికలకు ఎంతో వ్యవధి లేదు.. కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు రూపంలో వైసీపీకి పటిష్ట యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుని రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలి’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =