జయశంకర్ భూపాలపల్లిలో రూ. 102 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Starts Several Development Works Worth of Rs 102 Cr in Jayashankar Bhupalpally, Harish Rao Starts Several Development Works Worth of Rs 102 Cr in Jayashankar Bhupalpally, Several Development Works Worth of Rs 102 Cr in Jayashankar Bhupalpally, Jayashankar Bhupalpally, Minister Harish Rao Starts Several Development Works Worth of Rs 102 Cr, Minister Harish Rao, Harish Rao, T Harish Rao, Minister of Finance of Telangana, T Harish Rao Minister of Finance of Telangana, Finance Minister of Telangana, T Harish Rao Finance Minister of Telangana, Several Development Works in Jayashankar Bhupalpally, Development Works, Jayashankar Bhupalpally News, Jayashankar Bhupalpally Latest News, Jayashankar Bhupalpally Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. రూ. 102 కోట్ల విలువజేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 55 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న 200 పడకల భారీ ఆస్ప‌త్రికి, అలాగే మరో రూ. 6 కోట్ల‌ వ్య‌యంతో రేడియోల‌జీ, పాథాల‌జీ ల్యాబ్స్‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ ల్యాబ్‌ల్లో 56 రకాల వైద్య పరీక్షలను పూర్తి ఉచితంగా చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొననున్నారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని, ఈ నిధులను వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వసతులు మరియు అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా రాష్ట్రమంతటా ఉచితంగా కిట్లు అందజేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తోందని, కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ఇంకేం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నైతిక విలువలు లేకుండా ధనంతో రాజకీయాలు చేయడం ఆ రెండు పార్టీలకు అలవాటేనని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జేపీ న‌డ్డా విమర్శలు అర్థరహితమని, ఆయన ఒకసారి భూపాల‌ప‌ల్లికి వచ్చి కాళేశ్వ‌రం నీళ్లు పంట పొలాల‌కు అందుతున్నాయో, లేదో స్వయంగా చూడాలని కోరారు. వ‌రంగ‌ల్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన డిక్ల‌రేష‌న్‌ అమలు సాధ్యం కాదని హరీష్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − two =