డిసెంబర్ నాటికీ జీహెచ్ఎంసీ పరిధిలో 85 వేల ఇళ్ళు అందజేత – మంత్రి కేటిఆర్

2BHK Housing Government of Telangana, Dignity Housing Schemes, Dignity Housing Schemes in Hyderabad, Hyderabad, KTR On Dignity Housing Schemes in Hyderabad, Minister KTR, Minister KTR Review Meeting, Status of Dignity Housing Schemes, Telangana 2BHK Housing Scheme

తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పై ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో సుమారు 85 వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. సుమారు 9 వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు.

సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు, జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం అధికారులు పురపాలక శాఖ ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నవని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వాటిని వెంటవెంటనే పేద ప్రజలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జెఎన్ఎన్ యుఆర్ఎం మరియు వాంబే ఇళ్లు ఉన్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు.

ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు. దీనికి సంబంధించిన లబ్దిదారుల క్యాచ్మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రి కేటిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చినటువంటి మురికివాడల్లోని ప్రజల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10% స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో సింహభాగాన్ని ఈ సంవత్సరం చివరి వరకు ప్రజలకు అందిస్తామని మంత్రి కేటిఆర్ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =