డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates 2BHK Dignity Houses At Jai Bhavani Nagar In Vanasthalipuram,KTR Inaugurates 2BHK Houses In Vanasthalipuram,Telangana,KTR Launches 2BHK Houses In Vanasthalipuram,KTR On Wednesday Inaugurated Double Bedroom Houses In Vanasthalipura,Mango News,Mango News Telugu,2BHK Houses,Municipal Administration and Urban Development Minister KTR,Vanasthalipuram,KTR Double Bedroom Houses,MinisterKT Rama Rao,Vanasthalipuram 2BHK Houses,Double Bedroom Houses In Vanasthalipuram,Minister KTR Inaugurates 2BHK Dignity Houses,IT Minister KTR,Minister KTR,KTR,KTR speech,TRS Working President,KTR Latest News,Telangana IT Minister,KTR live,trs,CM KCR,Double Bedroom Houses,Vanasthalipuram,Vanasthalipuram News,Telangana News

ఎల్బీ నగర్ నియోజకవర్గం, వ‌న‌స్థ‌లిపురం ప‌రిధిలోని జై భ‌వాని న‌గ‌ర్‌లో రైతుబజార్‌ వద్ద పేదల కోసం రూ.28 కోట్లతో నిర్మించిన 324 డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు.

పేదల ఇళ్లు ఆత్మ‌గౌర‌వంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనను అని, అందుక‌నుగుణంగా అన్ని సదుపాయాలతో 324 ఇళ్లను నిర్మించి ప్రజలకు అందజేయడం జరిగిందని చెప్పారు. ఇలాంటి ఇళ్ల నిర్మాణం కార్యక్రమం భారతదేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు. ఒక్కో ఇంటికి దాదాపుగా 9 లక్షలు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం చివరిదశకు చేరుకుందని, ఇందుకోసం రూ.9714 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, ముంబయి, ఢిల్లీ, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లో కూడా ఈ స్థాయి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 2 =