రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది? – మంత్రి కేటిఆర్

GHMC Election Campaign, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections News, GHMC Nominations, Hushaar Hyderabad Program, KTR, KTR At Hushaar Hyderabad Program, KTR GHMC Election Campaign, KTR GHMC Election Campaign Schedule, KTR Hushaar Hyderabad Program, KTR with Business Community, Mango News, Minister KTR Interacted with Business Community, TRS

హైదరాబాద్ మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం నాడు జరిగిన ‘హుషార్‌ హైదరాబాద్‌ విత్‌ కేటిఆర్‌’ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వ్యాపార సంస్థల యజమానులు, వాణిజ్య రంగం, పారిశ్రామిక రంగం, భవన నిర్మాణ రంగానికి చెందిన పలువురు యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రభావం ప్రతిదేశంపై, ప్రతి ప్రభుత్వంపై, ప్రతి సంస్థపై, ప్రతి ఒక్కరిపై పలువిధాలుగా పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రంగాలపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇంకా చేయాల్సి ఉందని అన్నారు. మార్చి-సెప్టెంబర్ కరోనా కాలానికి పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, థియేటర్లుకు సంబంధించి కరెంట్ మినిమం డిమాండ్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారని చెప్పారు.

నోట్ల రద్దు దుష్ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయి:

మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ అనంతర కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందిందని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. కేంద్రం అవలంబిస్తున్న విధానాల వలన ప్రజలకు మంచి జరగట్లేదని అన్నారు. గతంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికి పెద్ద నోట్ల రద్దు దుష్ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇక కరోనా లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కరెంటు కోసం ఇందిరా పార్క్‌ పెద్దఎత్తున ధర్నాలు జరిగేవని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24 గంటలు పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో గతంలోలాగా కర్ఫ్యూలు లేవని, శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఏరో స్పేస్‌, ఎలక్ట్రానిక్ లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందని చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా‌ నగరం ఎంతో ప్రశాంతంగా ఉందని, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీపడమని, హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కేటిఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 18 =