మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో ‘బీఆర్‌ఎస్‌’కు సానుకూల అవ‌కాశాలు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR Interesting Comments on Chances of BRS Party in Next Parliament Elections, Minister KTR Interesting Comments on BRS Party, BRS Party Next Parliament Elections, BRS Party By Kcr, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

వచ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌లే లక్ష్యం అని, దీనికోసం ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్ర‌గతి భ‌వ‌న్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్, దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన జాతీయ పార్టీ భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్‌) పార్టీకి క్రమంగా ఆదరణ పెరుగుతోందని, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లో ‘బీఆర్‌ఎస్‌’కు సానుకూల అవ‌కాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తోంది అధికారం కోసమో, ప‌ద‌వుల కోసమో కాదని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న దేశాన్ని చూడలేకేనని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని, కేసీఆర్ ఆధ్వర్యంలో ఇది దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఫ్లోరైడ్ సమస్యను మిష‌న్ భ‌గీర‌థ‌తో ప‌రిష్క‌రించారని, అలాగే రైతులకు ఉచితంగా 24 గంట‌లు విద్యుత్ ఇవ్వొచ్చ‌ని నిరూపించార‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని, అందుకే సరిహద్దు రాష్ట్రాల ప్రజలు వారి జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మీడియాలో వెల్లడవుతున్న నివేదికల ప్రకారం.. భార‌త్, నైజీరియా కంటే దారుణంగా త‌యారవుతోంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి దేశ సమస్యల పట్ల సరైన అవగాహన లేదని, ఆయన జ‌న్ కీ బాత్ విన‌రని.. కేవలం తన మ‌న్ కీ బాత్ మాత్ర‌మే చెబుతార‌ని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నారని, వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపైకి ఐటీ, ఈడీ, సీబీఐ తదితర కేంద్ర సంస్థలను ఉసిగొల్పి దాడులు చేఇస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =