మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

Minister KTR Invited to Deliver Keynote Address at World Environmental and Water Resources Congress to be held in May at USA,Minister KTR Invited,Deliver Keynote Address,World Environmental and Water Resources Congress,Mango News,Mango News Telugu,World Environmental And Water Resources Congress 2023,Ewri,Ewri 2023,World Environmental And Water Resources Congress 2022,Water Resources Conference 2023,Environmental Water Resources,Environmental And Water Resources Engineering,Ewri Lid Conference,World Environmental And Water Resources Congress 2017,World Environmental And Water Resources Congress 2015,World Environmental And Water Resources Congress 2020,World Environmental And Water Resources Congress 2008,World Environmental And Water Resources Congress 2016,World Environmental And Water Resources Congress 2018,World Environmental And Water Resources Congress 2019,World Environmental And Water Resources Congress 2011,World Water And Environmental Resources Congress 2005

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. 2023, మేలో అమెరికాలోని నెవాడాలో జరగనున్న వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో కీలకోపన్యాసం చేయడానికి మంత్రి కేటీఆర్ ను అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యొక్క ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ) ఆహ్వానించింది. ఈడబ్ల్యూఆర్ఐ అనేది పర్యావరణ మరియు నీటి సంబంధిత సమస్యల కోసం అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ యొక్క టెక్నీకల్ సోర్స్. ఆరేళ్ల క్రితం 2017, మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ప్రతిష్ఠాత్మక వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ మరియు మిషన్ కాకతీయ గురించి వివరించారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వాన లేఖలో, రాష్ట్రంలో మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసిన ప్రక్రియ గురించి మరియు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చడంలో వారి పాత్ర గురించి వినాలనుకుంటున్నట్లు ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ నాయకత్వ బృందం పేర్కొంది. అలాగే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా, ఈడబ్ల్యూఆర్ఐ ప్రతినిధి బృందం ప్రాజెక్టు స్థాయి, ఈ సౌకర్యాల నిర్మాణంలో చూపిన అద్భుతమైన వేగం మరియు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి అందించే సామాజిక సమానత్వం మరియు అపారమైన ప్రయోజనాలను చూసి ఆశ్చర్యపోయింది. ఈ ప్రతినిధి బృందానికి ఏఎస్సీఈ-ఈడబ్ల్యూఆర్ఐ ఎండీ బ్రియాన్ పార్సన్స్, ప్రెసిడెంట్ గా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వం వహించారు. తిరుగు ప్రయాణంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఈ ప్రతినిధి బృందం, తక్కువ సమయంలోనే ఒక విజన్‌ని వాస్తవ రూపంలోకి మార్చినందుకు తమ అభినందనలు తెలియజేశారని తెలిపారు. ఈ క్రమంలో మేలో జరిగే వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ సందస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం లేఖ పంపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =