మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనదిపై నూతన బ్రిడ్జిలు నిర్మిస్తాం: మంత్రి తలసాని

Ministers Talasani Srinivas Mahmood Ali Inspected Moosarambagh Bridge in Connection with Rains and Floods, Minister Mahmood Ali Inspected Moosarambagh Bridge in Connection with Rains and Floods, Minister Talasani Srinivas Inspected Moosarambagh Bridge in Connection with Rains and Floods, Moosarambagh Bridge in Connection with Rains and Floods, Rains and Floods, Moosarambagh Bridge, Home minister Mahmood Ali, MLA Kaleru Venkatesh, New bridge sanctioned for Moosarambagh, Minister for Animal Husbandry Talasani Srinivas Yadav, Moosarambagh Bridge News, Moosarambagh Bridge Latest News, Moosarambagh Bridge Latest Updates, Moosarambagh Bridge Live Updates, Mango News, Mango News Telugu,

మూసారాంబాగ్, చాదర్ ఘాట్ లలో మూసీనదిపై నూతన బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల మూసీనది వరద ఉదృతికి దెబ్బతిన్న మూసారాంబాగ్ బ్రిడ్జిని శుక్రవారం రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కొత్తగా మంజురైన బ్రిడ్జి నిర్మాణాలను 10 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. భారీ వర్షాలు కురిసి ఊహించని విధంగా మూసీ నదికి వరదలు రావడం వలన మూసారాంబాగ్ బ్రిడ్జి, పటేల్ నగర్, గోల్నాక తదితర పరిసర ప్రాంతాలు ముంపుకు గురై ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించారు. తద్వారా ఈ బ్రిడ్జి పై నుండి రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం 52 కోట్లు, చాదర్ ఘాట్ బ్రిడ్జి కోసం 42 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వివరించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను 10 రోజులలో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. ఈ బిడ్జిలు అందుబాటులోకి వస్తే రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండబోదని స్పష్టం చేశారు. మూసీనది వెంట ఉన్న కాలనీలు, ఇండ్లు ముంపుకు గురికాకుండా మూసీనది వెంట అవసరమైన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. గతంలో భారీ వర్షాలు వస్తే నగరంలో ప్రజలు అనేక అవస్థలు పడేవారని, తెలంగాణా ప్రభుత్వం జీహెఛ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా ద్వంసమైన రహదారులను గుర్తించి ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మత్తులను చేపడుతున్నట్లు చెప్పారు. నగరంలోని పలు నాలాలకు ఎగువనుండి వచ్చే వరదతో పరిసరాలలోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ సమస్య పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో చేపట్టడం జరిగిందని వివరించారు. వచ్చే జూన్, జూలై నాటికి నాలాల అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 12 =