సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

Best employees felicitated on SCCL Formation Day, Employees on Singareni Formation Day, Kalvakuntla Kavitha Extends Wishes to Workers, Kavitha Extends Wishes to Workers Employees on Singareni Formation Day, Mango News, MLC Kalvakuntla Kavitha, MLC Kalvakuntla Kavitha Extends Wishes to Workers, MLC Kalvakuntla Kavitha Extends Wishes to Workers Employees on Singareni Formation Day, SCCL, SCCL Formation Day, Singareni Collieries, Singareni Collieries Company, Singareni Collieries Company Limited, Singareni Formation Day

తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌ సంస్థ 101వ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటుంది. డిసెంబర్‌ 23, 1920న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌’ నామకరణం జరగడంతో, అప్పటినుంచి అదే తేదీన ప్రతి సంవత్సరం ఆవిర్భావదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మికులు, ఉద్యోగులు, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

“తెలంగాణ మకుటం,సిరులవేణి సింగరేణి శత వసంతాలు పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులు, ఉద్యోగులు,యాజమాన్యానికి హార్ధిక శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి ప్రగతి పథంలో పయనిస్తూ, దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోంది. కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల పక్షాన టీబీజీకేఎస్ పోరాటం కొనసాగిస్తుంది” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 3 =