వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్: స్లాట్స్ బుకింగ్‌తో రూ.85లక్షల ఆదాయం

Non-agricultural Properties Slot Bookings: Rs 85 Lakhs Income Generated Till Friday 7 PM,Non-agricultural Properties Slot Bookings Income,Non-agricultural Properties Rs 85 Lakhs Income Generated,Non-agricultural Properties,Registration Of Non-Agricultural Properties Slot Bookings,Non-Agricultural Properties Slot Bookings,Mango News,Mango News Telugu,Chief Secretary Somesh Kumar,Telangana,Non-Agricultural,Non Agricultural Slot Bookings,Non-Agricultural Properties Registations In Telangana,Telangana Latest News,Telangana Non-agricultural Properties,Non Agricultural Land Registration,Land Registrations In Telangana,Online Property Registration,Land Registration In Telangana

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు 37 స్లాట్లు బుక్ చేయబడ్డాయని మరియు స్లాట్‌ బుకింగ్‌ ద్వారా అప్పటికి రూ.85 లక్షల ఆదాయం సమకూరినట్లు సీఎస్ వెల్లడించారు. అలాగే 17,567 మంది ఈ వెబ్ సైట్ ను సందర్శించారని, 3987 మంది వినియోగదారులు రిజిస్టర్ చేసుకోగా 4143 లావాదేవీలు ప్రారంభించబడ్డాయని అన్నారు. ఈ సౌకర్యం ద్వారా ప్రజలు ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని అన్నారు. మీసేవ కేంద్రాల్లో కూడా రూ.200 చెల్లించి స్లాట్లు బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించినట్లుగా సీఎస్‌ తెలిపారు.

మరోవైపు ఈ పద్దతి‌ ద్వారా సులభంగా డాక్యుమెంట్‌ కూడా తయారు చేసుకునే అవకాశముందని అన్నారు. బిల్డర్లు మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్లుకు కొత్త విండో ద్వారా పెద్దమొత్తంలో కొత్త ప్రాపర్టీస్(ఆస్తులు) నమోదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. దీని ప్రకారం 451 మంది బిల్డర్లు మరియు డెవలపర్లు 93,874 ప్రాపర్టీస్ ను నమోదు చేసినట్టు తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా శుక్రవారం సాయంత్రానికి 12,699 టి-పిన్‌లను కేటాయించామని, ఈ ప్రాపర్టీస్ త్వరలోనే రిజిస్టేషన్స్ కోసం వచ్చే అవకాశం ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఇక డిసెంబర్ 14, 2020 నుండి కేటాయించిన స్లాట్ల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ల నమోదు ప్రారంభం కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =