ఓటీటీ నుంచి నయనతార ‘అన్నపూరణి’ ఔట్

Nayanthara Annapurani Out From OTT,Nayanthara Annapurani,Annapurani Out From OTT,Nayanthara Out From OTT,Nayanthara Starrer Annapoorani,Nayantharas 75Th Film Annapoorani,Mango News,Mango News Telugu,Annapoorani Removed From Netflix,Annapoorani Pulled From Netflix,Nayanthara, Annapoorani, Case On Nayanathara, Cinema,Nayanthara Annapurani Latest News
nayanthara, annapoorani, case on nayanathara, cinema

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నపూరణి’. ఇది నయనతార నటించిన 75వ సినిమా. డైరెక్టర్ నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ హీరో జై, సత్యరాజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. భారీ స్పందన వచ్చింది. ఇంతలోనే సినిమా బృందానికి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ముందు నుంచి కూడా ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడని.. ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. తాజాగా ఈ సినిమాపై ముంబైలో మరో కేసు నమోదయింది. మహరాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ఈ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘అన్నపూరణి’ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడు అన‌డం.. శ్రీరాముడిని కించపరిచేలా ఉంద‌ని రమేశ్ సోలంకి ఆరోపించారు. హీరో ముస్లిం అయ్యి ఉండడం.. హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండడంతో లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు చిత్రబృందంపై చర్యలు తీసుకోవాలని.. మూవీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఆ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోన్న నెట్‌ఫ్లిక్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు నయనతారపై కూడా కేసు ఫైల్ అయింది. అయితే ఈ సినిమాపై రోజురోజుకు వివాదం ముదురుతుండడంతో నెట్‌ఫ్లిక్స్ అప్రమత్తమయింది. ఈ మేరకు అన్నపూరణి స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =