ఎన్నికల కోసం అధికారులు అలర్ట్

Officials on Alert For Elections,Officials on Alert,Alert For Elections,Election Commission, Chief Secretaries to Govt, 3days are dry days, in Telangana,Officials on alert, elections,Mango News,Mango News Telugu,Alert For Elections Latest News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Officials on Alert Latest News,Officials on Alert Latest Updates
election commission, Chief Secretaries to Govt, 3days are dry days, in Telangana,Officials on alert, elections

తెలంగాణలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో తాజాగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ప్రకటించింది. పోలింగ్ జరిగే రోజు అంటే నవంబర్ 30న సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను ఆదేశించింది.

మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ఆ 5 రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం , ఇతర కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమీక్షలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో.. ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని.. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు  తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని సీఎస్ శాంతి కుమారి వివరించారు.

సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు ఇప్పటికే డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. తెలంగాణలో కొద్ది రోజుల ముందు నుంచే నిఘా పెంచామని, దీంతో ఇప్పటి వరకు రూ. 385 కోట్ల వరకూ నగదును తాము జప్తు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 17 జిల్లాల్లో ఇప్పటికే 166 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.

సరిహద్దు రాష్ట్రాలతో సమర్థమైన కో ఆర్డినేషన్ కోసం డీజీపీ ఆఫీసులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సీఎస్ తెలిపారు. అంతేకాదు నవంబర్ 30న తెలాంగాణలో పోలింగ్ జరగనుండటంతో.. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30 వరకు తెలంగాణలో డ్రై డేగా ప్రకటించినట్లు వివరించారు.    తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికల తేదీని ప్రకటించగా.. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =