మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, స్వాగతించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay Welcomes High Court Key Orders Over The Moinabad Farmhouse Case,Telangana High Court,Lifts Stay Orders,Moinabad Farm House,Moinabad Farm House Case,Mango News,Mango News Telugu,TRS MLAs Poaching Case,Telangana HC Lifts Stay on Probe,MLAs poaching case,TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతించారు. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరపాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు దీనిపై తన స్పందనను ఆయన వివిధ ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ‘నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరపాలని తెలంగాణ హైకోర్టు గౌరవనీయమైన ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కోర్టుపై మాకు నమ్మకం ఉంది, విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని బండి పేర్కొన్నారు.

అలాగే బండి సంజయ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ ప్రకటనలతో బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సీఎం ప్రెస్‌మీట్‌పై కోర్టు చేసిన వ్యాఖ్యలు అభినందనీయం. సిట్ దర్యాప్తు పురోగతిని బహిర్గతం చేయకూడదని, మరియు నవంబర్ 29 లోపు సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించడాన్ని మేము స్వాగతిస్తున్నాము’ అని తెలిపారు. ఇంకా ఆయన ఇలా చెప్పారు. ‘తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా తప్పు చేసినవారు మరియు కుట్రదారులను శిక్షించాలి. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఈ ఫామ్‌హౌస్ డ్రామా వెనుక ఉన్న స్కీమర్‌లు బయటపడతాయని మరియు దోషులకు తగిన శిక్ష పడుతుందని మేము విశ్వసిస్తున్నాము’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఈ కేసు ద‌ర్యాప్తును బీజేపీ సీబీఐకి ఇవ్వ‌డానికి హైకోర్టు నిరాక‌రించింది. అలాగే మీడియాకు గానీ, రాజ‌కీయ నాయ‌కుల‌కు గానీ ద‌ర్యాప్తు వివ‌రాలు వెల్ల‌డించొద్ద‌ని, ద‌ర్యాప్తు నివేదిక‌ను ఈ నెల 29న కోర్టు ముందు స‌మ‌ర్పించాల‌ని కూడా పోలీసులను ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 19 =