తెలంగాణ సీఎంఓలో కీలకమైన మార్పులు

Smita Sabharwal out Amrapali in,Smita Sabharwal,Sabharwal out Amrapali in,Smita Sabharwal ,Smita Sabharwal out, Amrapali in, changes in Telangana CMO,Telangana CMO,Mango News,Mango News Telugu,Amrapali Vs Smita sabharwal,Telangana Govt Key Post to Amrapali,Amrapali IAS,Smita Sabharwal Latest News,Amrapali Live Updates,Amrapali Latest News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Smita Sabharwal ,Smita Sabharwal out, Amrapali in, changes in Telangana CMO,Telangana CMO

ఎప్పుడైనా ప్రభుత్వం మారితే  రాజకీయ పరిస్థితులు మారేలా పథకాల పేర్లు, అధికారులు కూడా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అప్పటి వరకూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఆఫీసులో అధికారుల టీమ్ కూడా మారిపోతుంది. అయితే  ఈ సందర్భంగా  సీఎంఓలో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారులయిన స్మితా సబర్వాల్, ఆమ్రపాలి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వీరిలో ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్ బృందంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఇక నుంచి కేంద్ర సర్వీసులోకి వెళ్లడానికి చూస్తుంటే.. ఇటు మాత్రం ఇప్పటివరకూ కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి రేవంత్ రెడ్డి టీమ్‌తో జాయిన్ అవుతారనే చర్చ జరుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొత్త టీమ్‌ను  మెల్లమెల్లగా సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగా సీఎంఓలో పనిచేసే అధికారుల ఎంపికపైనే రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు ఇప్పటికే స్థానచలనం మొదలైంది. అయితే ముఖ్యంగా వీరిలో ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్, మరో ఐఏఎస్ ఆమ్రపాలి పేరు వినిపిస్తుంది. వృత్తి పరంగా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కనబరుస్తున్న సామర్థ్యాన్ని గుర్తించిన అప్పటి సీఎం కేసీఆర్  ఆమెను కార్యదర్శిగా నియమించారు .

సీఎంఆఫీసు ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను కూడా స్మితా సబర్వాల్‌కు అప్పగించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా ఆమె పర్యవేక్షించారు.  చివరకు సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్ లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేస్తుండేవారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరినప్పటి నుంచి కూడా  స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదన్న వార్తలు వినిపించాయి. అంతెందుకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. చాలామంది  అధికారులు వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం ఇప్పటి వరకు సీఎం రేవంత్ ను కలవలేదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే స్మితా భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. దీంతో తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.

మరోవైపు స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎంఓలోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి రానున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగినట్లే రీసెంట్‌గా కేంద్ర సర్వీస్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమెకు సీఎంఓలో కీలక బాధ్యతలు కన్ ఫర్మ్ అంటూ పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీ కేడర్‌లో 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా ఆమ్రపాలి విధుల్లో చేరారు. తెలంగాణలో చాలా జిల్లాలలో ఆమె కలెక్టర్ గా పని చేశారు. 2011లో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా విధుల్లో చేరిన ఆమ్రపాలి.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలకు కలెక్టర్ గా పని చేసి డైనమిక్ అధికారిణిగా పేరు  పొందారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గానూ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్ సీఈవోగానూ ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చారు.

స్మితా సబర్వాల్, ఆమ్రపాలి మధ్య వృత్తిపరంగా చాలా పోలికలు కనిపిస్తాయని చాలామంది అంటుంటారు. ఇద్దరూ చిన్న వయసులోనే సివిల్స్ ర్యాంకు సాధించారు. కాకపోతే స్మితా సబర్వాల్ 4వ ర్యాంకు సాధిస్తే ..ఆమ్రపాలి 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. బాధ్యతల విషయంలో ఇద్దరు కూడా చాలా స్ట్రిక్ట్ అనే మంచి పేరుంది. అయితే సీఎంఓ నుంచి స్మితా సబర్వాల్ వెళ్లడం, ఆమ్రపాలి రావడం తెలంగాణలో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 1 =