నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ.. తాజా పరిణామాలపై కీలక చర్చ

Telangana BJP Mini Core Committee To Meet Union Home Minister Amit Shah Today Will Discuss on Latest Developments,Telangana BJP Mini Core Committee,Telangana BJP Committee To Meet Amit Shah,Union Home Minister Amit Shah Committee Meet,Minister Amit Shah on Latest Developments,Mango News,Mango News Telugu,Amit Shah Family,Address Of Amit Shah Home Minister,Amit Shah And Sunil Shah Relationship,Amit Shah Daughter,Amit Shah Qualification,Amit Shah Religion,Amit Shah Wikipedia,Home Minister Amit Shah Mobile Number,Home Minister Of India,Is Amit Shah Jain,Is Amit Shah Married,Salary Of Home Minister Amit Shah,Telangana Bjp Central Ministers,Telangana Bjp Cm,Telangana Bjp Minister,Telangana Bjp Minority Morcha,Union Home Minister Amit Shah Twitter

తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీకి ఢిల్లీ నుంచి పిలు అందింది. ఈ మేరకు వారు మంగళవారం బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక అమిత్ షాను కలవనున్నవారిలో.. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ బన్సాల్‌, తరుణ్ చుగ్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ముఖ్య నేతలు వెంకట స్వామి, విజయశాంతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అవకాశం, వాటి సన్నద్ధతపై రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై బలంగా పోరాడాలని, వైఫల్యాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని సూచించనున్నారని సమాచారం. అలాగే రానున్న ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సిన తీరు, సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై కోర్ కమిటీకి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.

కాగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమం నేటితో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పార్టీ ప్రముఖ నాయకులను అత్యవసరంగా ఢిల్లీకి పిలవడం గమనార్హం. దీంతో ఈ రోజు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య తెలంగాణ బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాంటి పరిణామాలు జరిగినా.. ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రెడీ చేసుకోవాలని అమిత్ షా సూచించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =