జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, నష్టంపై అంచనా

Telangana Central Team Visits Flood Affected Areas To Estimate Damage in Jayashankar Bhupalpally District, Estimate Damage in Jayashankar Bhupalpally District, Telangana Central Team Visits Flood Affected Areas, Flood Affected Areas, Telangana Central Team, Central Team Surveys Flood Damage, A central team which arrived in the state to assess flood damage visited Jayashankar Bhupalpally, Four member Central team arrives in Telangana, Adilabad and Bhadradri-Kothagudem districts, Flood Affected Areas, Jayashankar Bhupalpally District News, Jayashankar Bhupalpally District Latest News, Jayashankar Bhupalpally District Latest Updates, Jayashankar Bhupalpally District Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నగరానికి వచ్చింది. ఈ బృందం పర్యటన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాను సందర్శించింది. తద్వారా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులను పరిశీలించి వరద నష్టాన్ని అంచనా వేసి రిపోర్ట్ తయారు చేయనుంది. అయితే దీనికి ముందుగా జెన్ కో గెస్ట్‌ హౌస్‌లో జిల్లాల్లో వరదల పరిస్థితిపై పూర్తి వివరాలను కలెక్టర్‌ భవేష్ మిశ్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. గోదావరికి ఇంత భారీగా వరదలు రావడం ఇదే తొలిసారి అని.. పలిమెల, మహదేవ్ పూర్, మహా ముత్తారం, కాటారం, మల్హర్ రావు, భూపాలపల్లి మండలాలలో వరదల నష్టాన్ని తెలియజేశారు.

అయితే తెలంగాణలో వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ 251 పశువులు చనిపోయాయని కేంద్ర బృందానికి వెల్లడించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీముల హాయంతో వరద ప్రభావిత పోరాటాల్లో యుద్ధ ప్రాతిపదికన నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. కాగా ఈ బృందం తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని నిర్మల్, మంచిర్యాల, కడెం ప్రాజెక్టు, భద్రాద్రి-కొత్తగూడెంలోని భద్రాచలం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వరద కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన విషయాన్ని అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − sixteen =