ఉపరాష్ట్రపతి ఎన్నిక‌లు-2022: ఓటింగ్‌కు దూరంగా ఉండాల‌ని టీఎంసీ పార్టీ నిర్ణ‌యం

Vice Presidential Election-2022 Mamata Banerjee's TMC Party Decides to Abstain from Voting, Mamata Banerjee's TMC Party Decides to Abstain from Voting, Mamata Banerjee Decides to Abstain from Vice Presidential Election-2022 Voting, TMC Party Decides to Abstain from Voting, Abstain from Voting, Vice Presidential Election-2022 Voting, Vice Presidential Election-2022, 2022 Vice Presidential Election, Vice Presidential Election, TMC Party decision to abstain from voting in vice-presidential polls, vice-presidential polls, Mamata Banerjee-led TMC To Abstain From Vice Presidential Election-2022 Voting, TMC To Abstain From Vice Presidential Election-2022 Voting, Vice Presidential Election-2022 News, Vice Presidential Election-2022 Latest News, Vice Presidential Election-2022 Latest Updates, Vice Presidential Election-2022 Live Updates, Mango News, Mango News Telugu,

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక‌ల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్టు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గురువారం ప్రకటించారు.

ఎంపీలతో సమావేశం అనంతరం అభిషేక్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ కు టీఎంసీ మద్దతు ఇచ్చే అంశమే తలెత్తదని, అలాగే విపక్ష అభ్యర్థిని నిర్ణయించిన విధానం కూడా సరిగ్గా లేదన్నారు. లోక్ సభ, రాజ్యసభలో 35 మంది ఎంపీలు ఉన్న టీఎంసీ పార్టీతో సరైన సంప్రదింపులు లేకుండా విపక్ష అభ్యర్థిని నిర్ణయించారన్నారు. మార్గరెట్ అల్వాకు, సీఎం మమతా బెనర్జీకి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల ఆధారంగా దేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలని కోరుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలలో 85 శాతం మంది ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని అనడంతో, ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =