రాష్ట్రంలో కోవిడ్ వాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

Distribution For Covid-19 Vaccine, First Batch of Covishield Corona Vaccine, Mango News, Somesh Kumar, Telangana Corona Vaccine, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Holds Review Meeting On Frame Work For Action Plan On Road Safety, Telangana CS Somesh Kumar Review Over Covid 19 Vaccination, Telangana Receives First Batch of Covishield, Vaccine Distribution

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు చేపట్టాల్సిన వ్యవస్థాపరమైన ఏర్పాట్లను కలెక్టర్లతో సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిజేస్తున్నహెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు. వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

వాక్సినేషన్ ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతి కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సమన్వయ పరిచేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా వాక్సినేషన్ ను రిజర్వులో(అదనంగా) ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. నెట్ వర్క్ ద్వారా ముందుగా నిర్ణయించిన లబ్దిదారులను జిల్లా యంత్రాంగంచే వాక్సినేషన్ కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ వాక్సినేషన్ కు చాలా ప్రాదాన్యత ఉన్నందున ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. మొదటి రోజు కొద్దిమంది లబ్ధిదారులనే వాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే విధంగా చూచి, ఆ అనుభవాలను బట్టి ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుండి లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =