ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం: సీఎస్

CS Somesh Kumar Held a Review Meeting on e-Health Modules with Officials

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆరోగ్య శాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యక్రమాలు అమలుపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్య శాఖ ద్వారా రూపొందించిన అప్లికేషన్లు వినియోగించడానికి సులభంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా సామర్ద్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా, సర్వీస్ డెలివరీని కూడా ప్రభావితం చేసేటట్లు ఉండాలని సూచించారు.

ఆరోగ్య శాఖ పరిదిలోని విభాగాధిపతులు నిర్వహించే రెగులెటరీ విధులను నిర్ణీత సమయంలోగా సమీక్షించి సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. టెక్నాలజీని సులభతరంగా, పారదర్శకంగా వాడుతూ, వేగవంతంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకటి కరుణ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.దివ్య, ఆయూష్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ అలుగు వర్షిని, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ఈఏటు సి.యస్ అద్వైత్ కుమార్ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోని బాలాదేవి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =