తెలంగాణ: విడుద‌లైన టీఎస్ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్స్.. ఏప్రిల్ 6 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీకరణ

Telangana EAMCET-2022 and ECET-2022 Notifications Released, Telangana EAMCET-2022 Notification Released, Telangana ECET-2022 Notification Released, Telangana ECET-2022, Telangana EAMCET-2022, EAMCET-2022, ECET-2022, TS EAMCET exam dates released, TS ECET 2022 exam dates released, Telangana State Council of Higher Education has released the TS EAMCET and TS ECET exam dates 2022, Telangana State Council of Higher Education has released the TS EAMCET exam dates 2022, Telangana State Council of Higher Education has released the TS ECET exam dates 2022, Telangana State Council of Higher Education, TSCHE, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఎంసెట్-2022, ఈసెట్-2022 నోటిఫికేష‌న్స్ విడుద‌లయ్యాయి. ఎంసెట్ దరఖాస్తులను ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. జూన్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ పరీక్ష జరుగనుంది. కావున అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఎంసెట్ క‌న్వీన‌ర్ సూచించారు. ఈసెట్ కోసం దరఖాస్తులను ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు స్వీక‌రిస్తారు. అలాగే ఈసెట్ పరీక్ష జులై 13వ తేదీన నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇటీవలే ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం జులై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష, జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజ‌నీరింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే జులై 13వ తేదీన ఈసెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షను రెండు తెలుగు రాష్ట్రాల్లోని 105 కేంద్రాలలో జరుపనున్నట్లు వెల్లడించారు. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్ధులందరినీ ప్రభుత్వం పాస్ చేసినందున, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండదు, ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు కేటాయించనున్నారు. ఇక ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు కోసం చెల్లించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + two =