మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి – గవర్నర్ తమిళిసై నివాళి

Chief Minister of Rajasthan, Civil Aviation Minister of India, Former Prime Minister of India, former Prime Minister of India PV Narasimha Rao, former Prime Minister of India PV Narasimha Rao Death Anniversary, Governor of Telangana, KCR remembers PV Narasimha Rao on his death anniversary, Mango News, Prime Minister Narendra Modi, Prime Minister Of India, PV Narasimha Rao Death Anniversary, Tamilisai Soundararajan, telangana governor, Telangana Governor Tamilisai Soundararajan, Telangana Governor Tamilisai Soundararajan Pays Tribute PV Narasimha Rao on his Death Anniversary

ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లేస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ సమాధి వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా, ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. మన జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, భాజపా నేత లక్ష్మణ్ తో పాటు పలువురు ప్రముఖులు పీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 90వ దశకంలో బలహీనంగా ఉన్నప్పుడు.. ఎంతో తెగువతో కొత్త కొత్త సంస్కరణలు తీసుకువచ్చి బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేశారు పీవీ అని గుర్తుచేసుకున్నారు. ఆయన మన తెలుగు వాడైనందుకు గర్విస్తున్నామన్నారు.

కరీంనగర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు (ప్రస్తుత తెలంగాణలో) PV నరసింహారావు. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు 1991 మరియు 1996 మధ్య భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసే విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినందుకు ప్రసిద్ధి చెందారు. మే 1991లో కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ హత్య తర్వాత, కాంగ్రెస్ (I) పార్టీ 70 ఏళ్ల వయసులో పీవీని తన నాయకుడిగా ఎన్నుకుంది.

జూన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత పీవీ భారతదేశానికి 10వ ప్రధాన మంత్రి అయ్యారు. భారత ప్రధాని కాకముందు, పీవీ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ గాంధీ హయాంలో విదేశాంగ, హోం మంత్రిగా కూడా పనిచేశారు. నరసింహారావు, తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌తో కలిసి భారతదేశాన్ని ఆర్థికంగా పరిపుష్ఠిగా ఉండేలా చేసారు. భారతదేశం నేడు నరసింహారావు 17వ వర్ధంతిని జరుపుకుంటున్నందున, రాజకీయ నాయకులు మరియు నెటిజన్లు మాజీ ప్రధానమంత్రి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =