తెలంగాణలో లాక్‌డౌన్‌ : పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Govt has Exempted Urban, Rural Area's Petrol Bunks From the Lockdown,Mango News,Mango News Telugu,CM KCR,Lockdown,Telangana CM KCR,Telangana News,Lockdown In Telangana State,CM KCR Live,Telangana Lockdown Updates,Telangana State,CM KCR,Telangana Lockdown Live Updates,Telangana Lockdown News,Covid-19,Covid-19 In Telangana,Telangana Lockdown,Lockdown In Telangana,Telangana News,Telangana Lockdown News,Telangana Lockdown Update Today,Telangana,Telangana Lockdown Updates,Lockdown News In Telangana,Telangana Live News,Telangana News Live,Telangana Govt Gives Exemption To Petrol Bunks,Telangana Petrol Bunks,Petrol Bunks,Telangana Govt has Exempted Petrol Bunks From the Lockdown,TS Govt Gives Exemption To Petrol Bunks,Second Phase Of Lockdown In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందుగా లాక్‌డౌన్‌ సమయంలో కేవలం జాతీయ రహదారులపై ఉండే పెట్రోల్, డీజిల్ పంపులు మాత్రమే నిరంతరం తెరిచే ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పెట్రోల్ బ్యాంకులకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయితే రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ జరుగుతుండడంతో కొనుగోళ్ల కేంద్రాల నుంచి రైస్ మిల్లుల వద్దకు వాహనాల్లో ధాన్యాన్ని తరలించవలసి ఉండడం, వ్యవసాయ అవసరాలు, ఎమర్జెన్సీ సేవల వాహనాల అవసరం దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఇకపై సాధారణ సమయాల్లో(పని గంటల్లో) పెట్రోల్ బ్యాంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =