తెలంగాణలో మందుల పంపిణీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Telangana Govt set up 3 Member Committee to Recommend Allocation of Tocilizumab to Patients,Mango News,Mango News Telugu,High Power Panel Formed For Allocation Of Tocilizumab,Telangana Govt Constitutes Committee To Recommend Allocation Of Tocilizumab Injections,Telangana Sets Up Panel To Approve Use Of Tocilizumab,Covid-19 Patients,Telangana Constitutes High Power Committee For Allocation Of Tocilizumab,Government,Private Hospitals,COVID-19,Telangana Takes Control Of Tocilizumab Injections For Covid,Telangana Govt,Telangana,Telangana News,Tocilizumab,Tocilizumab Injection

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్‌ డైరెక్టర్ మనోహర్‌, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్‌ జి.శ్రీనివాస రావు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

“కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమునకు మొదటి విడతగా 210 టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లను కేటాయించింది. వాటిలో 80 ఇంజెక్షన్ల వరకు రాబోయే 10 రోజుల్లో రాష్ట్రానికి చెందిన పేషంట్లకు అందుబాటులోకి రానున్నాయి. రోచె కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ ఇంజెక్షన్లను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ప్రత్యేక పరిస్థితుల్లో వున్న కోవిడ్ -19 పేషంట్లకు ఈ ఇంజెక్షన్ ను వైద్యులు సిఫారసు చేస్తారు. మన దేశంలో ఈ డ్రగ్ నిల్వలు కొన్ని వారాల క్రితమే అయిపోయాయి. మన దేశంలో సిప్లా కంపెనీ ఈ డ్రగ్ ను కొంత పరిమాణంలో దిగుమతి చేసుకొని మార్కెటింగ్, పంపిణీ చేస్తున్నది. పరిమితంగా అందుబాటులోకి రానున్న టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లను న్యాయబద్దంగా వినియోగించుటకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు సిపారసు చేయుటకై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులు( నిమ్స్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్ మరియు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ లు) సభ్యులుగా ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది” అని పేర్కొన్నారు.

టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లకై తమ హాస్పిటల్ లో వున్న స్పెసిఫిక్ పేషెంట్స్ ఆరోగ్యస్థితిని పేర్కొంటు ముగ్గురు స్పెషలిస్ట్స్ ల టీం ఇచ్చిన రికమండేషన్స్ జతపరిచి, నిర్ణిత ప్రొఫార్మాలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ క్రింద పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంతృప్తి చెందినట్లయితే టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లు కేటాయిస్తుంది.

  • యాక్టివ్ బ్యాక్టీరియా/ఫంగల్/ట్యూబర్ క్యూలర్ ఇన్ ఫెక్షన్ వుండని పేషంట్లు.
  • స్టెరాయిడ్స్ ఉపయోగించినప్పటికి ఆరోగ్యం మెరుగుపడని పేషంట్లు.
  • గణనీయంగా పెరిగిన తాపజనక గుర్తులు వున్న పేషంట్లు.
  • వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండి 24-48 గంటలలో ఐసీయూలో అడ్మిట్ అవదగిన పేషంట్లు.

అలాగే ముగ్గురు సభ్యుల కమిటీ రికమండేషన్స్ మేరకు సిప్లా కంపెనీ టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ ను అందజేస్తుంది. టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లకై [email protected] కు దరఖాస్తులు పంపాలి. టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ దరఖాస్తులో పేషంట్/హాస్పిటల్ వివరాలు, సంబంధిత హాస్పటల్ కు చెందిన ముగ్గురు స్పెషలిస్టుల రికమెండేషన్ తదితర అంశాలతో కూడిన నిర్ణీత ప్రొఫార్మాను నింపి, ఆన్ లైన్ లో పంపాలని సూచించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − sixteen =