తెలంగాణలో కొనసాగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ

Telangana Mini Municipal Elections: Counting Process Underway,Mango News,Mango News Telugu,GHMC Polls,GHMC polls,Telangana Mini Municipal Elections,Telangana Mini Municipal Elections Counting,TS Mini Municipal Election Results,Telangana Municipal Elections,Telangana Mini Municipal Election Results,Municipal Elections,Municipal Election Results,Warangal Municipal Elections,Mini Municipal Election Results,Telangana Municipal Elections 2021,Telangana Municipal 2021,Telangana Municipal Election,Municipal Elections In Telangana,Khammam Municipal Elections,Siddipet Municipal Election,Greater Warangal Municipal Elections,Telangana Elections,Telangana News,2021 Telangana Mini Municipal Elections

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ కొనసాగుతుంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా రాష్ట్రంలోని ఖమ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్లతో పాటుగా సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, అచ్చంపేట‌, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌లో మరియు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లోని లింగోజిగూడ వార్డు సహా పలు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన వార్డులకు ఏప్రిల్ 30న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని కరోనా నిబంధనలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అలాగే కరోనా నెగెటివ్‌ రిపోర్ట్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లనే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పూర్తిస్థాయి ఫలితాలు సోమవారం రాత్రికి వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ మినీ మున్సిపల్ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అన్ని చోట్ల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఖమ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల పరిధిలో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో మరికొన్ని గంటల్లో తేలనుంది.

కౌంటింగ్ జరుగుతున్న కార్పోరేషన్స్, మున్సిపాలిటీల వివరాలు:

  • ఖమ్మం కార్పోరేషన్ : 60 వార్డులు
  • వ‌రంగ‌ల్ కార్పోరేషన్ : 66 వార్డులు
  • సిద్దిపేట‌ మున్సిపాలిటీ : 43 వార్డులు
  • జ‌డ్చ‌ర్ల‌ : 27 వార్డులు
  • కొత్తూరు : 12 వార్డులు
  • అచ్చంపేట‌ : 20 వార్డులు
  • న‌కిరేక‌ల్ : 20 వార్డులు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =