తమిళనాడులో డీఎంకే హవా, స్టాలిన్ కే పట్టం

Tamil Nadu Assembly Elections Results: DMK Wins After 10 Years,Mango News,Mango News Telugu,Tamil Nadu Assembly Elections Results,DMK Wins After 10 Years,Tamil Nadu Assembly polls,Stalin,Tamil Nadu Election Results 2021 Live,DMK leader Stalin,DMK,Tamil Nadu Election Results,Tamil Nadu Election Results 2021 Updates,Tamil Nadu Assembly Poll,Stalin Set To Be Chief Minister As DMK Wins After 10 years,MK Stalin,Tamil Nadu Polls,Tamil Nadu,Tamil Nadu News,Tamil Nadu CM,Tamil Nadu Assembly Elections,Tamil Nadu Elections,Stalin Vs CM Palaniswami,Tamil Nadu Assembly Polls,Chief Minister Of Tamil Nadu,Tamil Nadu Elections 2021,Tamil Nadu Politics,Tamil Nadu Election News,Tamil Nadu Election,Tamil Nadu Polls 2021,DMK Chief MK Stalin

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ ఘన విజయం సాధించింది. పదేళ్ల తరవాత తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ అధికారం దక్కించుకుంది. దివంగత సీఎం కరుణానిధి వారసుడిగా వచ్చి ఎంతో కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టాలిన్‌ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు. పది సంవత్సరాల పాటుగా అధికారంలో అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. తమిళనాడు ప్రజలు స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీకే పట్టంకట్టారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకే కూటమి 152 (గెలుపు+ఆధిక్యం) స్థానాల్లో సత్తా చాటింది. అన్నాడీఎంకే 82 (గెలుపు+ఆధిక్యం) స్థానాలు దక్కించుకోనుంది. కాగా అన్నాడీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ 4 స్థానాలు దక్కించుకుంది.

మరోవైపు కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి సత్తా చాటింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 99 స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. యూడీఎఫ్ 41 స్థానాలు దక్కించుకుంది. ఇక అస్సాం 126 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 75, కాంగ్రెస్ కూటమి 50, ఇతరులు 1 స్థానాన్ని దక్కించుకున్నారు. అస్సాంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టనుంది. అలాగే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 16, కాంగ్రెస్ కూటమి 8, ఇతరులు 6 స్థానాలలో గెలుపొందారు. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (234) : (గెలుపు+ఆధిక్యం):

  • డీఎంకే కూటమి : 152
  • అన్నాడీఎంకే కూటమి : 82
  • ఇతరులు : 0

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (140) :

  • ఎల్డీఎఫ్ : 99
  • యూడీఎఫ్ : 41
  • ఇతరులు : 0

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (126) :

  • బీజేపీ కూటమి : 75
  • కాంగ్రెస్ కూటమి : 50
  • ఇతరులు : 1

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (30) :

  • బీజేపీ కూటమి : 16
  • కాంగ్రెస్ కూటమి : 8
  • ఇతరులు : 6
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =