పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజుకు ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటన

1 Cr to Padma Shri Awardees Sakini Ramachandraiah, 1 Cr to Padma Shri Awardees Sakini Ramachandraiah Kanakaraju, CM KCR, CM KCR announces house site, CM KCR Announces House Site 1 Cr to Padma Shri Awardees Sakini Ramachandraiah Kanakaraju, Kanakaraju, Mango News, Mango News Telugu, Padma Shri Awardees Sakini Ramachandraiah, Padma Shri Awardees Sakini Ramachandraiah Kanakaraju, Telangana CM KCR, Telangana Padma Shri Awardees

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో సకిని రామచంద్రయ్య సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అలాగే గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణం ఖర్చులకోసం ఒక కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్, గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =