కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కీలక మార్గదర్శకాలు

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Schedule, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Guidelines for GHMC Elections, Mango News Telugu, telangana, Telangana Municipal Elections, Telangana SEC, Telangana State Election Commission, Telangana State Election Commission Released Guidelines for GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అమలు చేసే కరోనా నిబంధనలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, హోం శాఖతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను కూడా పరిగణనలోకి రూపొందించినట్లుగా వెల్లడించారు.

మొత్తం ఎలక్షన్ పక్రియలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన సాధారణ మార్గదర్శకాలు:

  • ప్రతి వ్యక్తి ఫేస్ మాస్క్ ధరించాలి – (“నో మాస్క్ నో ఎంట్రీ”)
  • ఎన్నికల కోసం ఉపయోగించే అన్ని పోలింగ్ స్టేషన్స్/ప్రాంగణాలు ప్రవేశాల వద్ద శానిటైజేర్ అందుబాటులో ఉంచాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం భౌతిక దూరం అమలుచేయబడుతుంది.
  • ఆచరణ సాధ్యమైనంతవరకు పెద్ద హాల్స్ ను గుర్తించి భౌతిక దూర ప్రమాణాలను నిర్ధారించి, ఎన్నికల కోసం ఉపయోగించాలి.
  • కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా పోలింగ్ సిబ్బంది మరియు భద్రతా సిబ్బంది కదలిక కోసం తగినంత సంఖ్యలో వాహనాలను సమీకరించాలి.
  • ఎన్నికల సంబంధిత సిబ్బంది అందరూ ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్ లోడ్ చేయాలి.
    ———————–
  • ఇక నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో పాటుగా ఇద్దరికి మాత్రమే అనుమతి. అలాగే రెండు వాహనాలను మాత్రమే వినియోగించాలి.
  • ఇక భద్రతా సిబ్బంది కాకుండా ఇంటింటికి ప్రచారం చేసే సమయంలో ఐదుగురి సభ్యుల బృందానికి మాత్రమే అనుమతి.
  • ప్రచారం కోసం వినియోగించే కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీస దూరం 100 మీటర్లు ఉండేలా చూసుకోవాలి.
  • అభ్యర్థుల నిర్వహించే రోడ్ షోలకు లేదా ఇరు పార్టీల ప్రచారం మధ్య కనీసం అరగంట పాటుగా విరామం ఉండాలి.
  • దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పెద్దలు, నోటిఫైడ్‌ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
  • కౌంటింగ్ సమయంలో హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఏర్పాటు చేయకూడదు.
  • కౌంటింగ్ మొదలయ్యే ముందు అన్ని బ్యాలెట్ బాక్సులను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 11 =