నర్సాపూర్‌(జి) మండలం ప్రత్యేకత తెలుసా?

Two constituencies in the same mandal,Two constituencies,constituencies in the same mandal,Two in the same mandal,Mango News,Mango News Telugu,Two constituencies, mandal, Narsapur G mandal,Assembly election 2023, assembly election, Telangana,List of Assembly Constituencies,Narsapur G mandal Latest News,Narsapur G mandal Latest Updates,Narsapur G mandal Live News
Two constituencies, mandal, Narsapur (G) mandal,Assembly election 2023, assembly election, Telangana,

ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నెన్నో విశేషాలు, విషయాల గురించి చర్చలు సాగుతాయి. అందులోనూ జిల్లాలు పెరిగాక.. నియోజకవర్గాలు కూడా మారిపోవడంతో అప్పటి వరకూ ఒక జిల్లాలో ఉండే  నియోజకవర్గాలు, మండలాలు కొత్తవి ఎన్ని వచ్చాయంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి నిలబడుతున్నారు? ఎవరు గెలుపు  సాధిస్తారో అంటూ ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటపుడే ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక మండలాలు వంటి విషయాలు బయటకు వస్తుంటాయి. అలా నర్సాపూర్‌(జి) మండలం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.

2016 సంవత్సరంలో నిర్మల్‌ కొత్త జిల్లాగా మారింది.  పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఆరు మండలాలు ఏర్పడగా అందులో నర్సాపూర్‌(జి) ఒక మండలంగా ఏర్పడింది. ముధోల్‌ నియోజకవర్గం నుంచి ఎనిమిది గ్రామాలైన నందన్‌, బామిని(బి), చాక్‌పల్లి, అర్లి(కే), గొల్లమాడ, తిమ్మాపూర్‌(జి), బూర్గుపల్లి(జి), తురాటి, నిర్మల్‌ నియోజకవర్గం నుంచి 5 గ్రామాలైన నర్సాపూర్‌(జి), రాంపూర్‌, టెంబుర్ని, కుస్లీ, అంజనీతండాలను కలుపుకొంటూ.. 13 గ్రామాలతో నూతన మండలంగా నర్సాపూర్‌ (జి) ఏర్పడింది.

ముధోల్‌ నియోజకవర్గం నుంచి  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి  విఠల్‌రెడ్డి గెలుపొందారు. నిర్మల్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి  విజయం సాధించారు.వీరిద్దరూ ఇక్కడ గెలుపొందడం. ఒక మండలం ఓటర్లు ఇలా 2 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయడం నర్సాపూర్‌(జి) మండలానికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకుంటారు. మరి ఈసారి ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతారో.. అంటూ ఈ రెండు నియోజకవర్గాలపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =