వికారాబాద్ జిల్లాలో ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీక్.. ఘ‌ట‌న‌పై తెలంగాణ విద్యాశాఖ సీరియస్, కఠిన చ‌ర్య‌లకు ఆదేశాలు

Vikarabad Collector Narayana Reddy Suspended Three Employees Who Leaked Tenth Question Paper in Tandur Today,Vikarabad Collector Narayana Reddy,Narayana Reddy Suspended Three Employees,Who Leaked Tenth Question Paper in Tandur Today,Mango News,Mango News Telugu,Vikarabad Collector Latest News,Collector Narayana Reddy Live News Today,Narayana Reddy Latest News and Updates,Tandur Today Latetst News,Tandur Live Updates

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే ప్ర‌శ్నాప‌త్రం లీక్ అవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్‌‌లో పరీక్ష మొదలైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చెక్కర్లు కొట్టడంతో అంతా అవాక్కయ్యారు. తాండూర్ మండల కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాండూరు ప్రభుత్వ పాఠ‌శాల‌-1 నుంచి పేపర్ లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్కూల్‌కు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్ నుంచి వాట్సప్‌లో ప్ర‌శ్నాప‌త్రం షేర్ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పేపర్ లీకేజ్‌పై ప్రాథమిక విచారణలో భాగంగా బందెప్పను ప్రశ్నించిన పోలీసులు, పరీక్ష మొదలైన కేవలం 7 నిమిషాల్లోనే ఆ ప్ర‌శ్నాప‌త్రాన్ని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్‌కు అతడు పంపిన‌ట్లు నిర్ధారించారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ వ్య‌వ‌హారంపై నివేదిక ఇవ్వాల‌ని వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్విజిలేట‌ర్, సూప‌రింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీస‌ర్‌ ముగ్గురిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ ముగ్గురిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు ఉద్యోగాల నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు కలెక్ట‌ర్ నారాయ‌ణ రెడ్డి ప్ర‌క‌టించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 9 =