కేసీఆర్ ను ఓడిస్తాం.. విప‌క్షాల కొత్త వ్యూహం..

We Will Defeat Kcr Oppositions New Strategy,We Will Defeat Kcr,Oppositions New Strategy,Mango News,Mango News Telugu,Cm Kcr, Brs, Bjp, Congress, Telangana Assembly Elections,Telangana Latest News and Updates,Telangana Politics, Telangana Political News and Updates,Hyderabad News,Telangana News,Telangana Assembly Elections,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Kcr Oppositions Strategy Latest News,Kcr Oppositions Strategy Latest Updates

అవును.. మేం కేసీఆర్ ను ఓడిస్తాం.. ఇలా ఒక‌రు ఇద్ద‌రు కాదు.. చాలా మంది ఈ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.  అంతేకాదు.. కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయక పోతే కామారెడ్డి, గజ్వేల్‌ల నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతామని, కామారెడ్డిలో వందకుపైగా నామినేషన్లు వేస్తామని కామారెడ్డి జిల్లాలోని తొమ్మిది గ్రామాల రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు కూడా ప్రకటించారు. ఓవైపు అభ్యర్థుల విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్న ప్రధాన పార్టీలు…. కేసీఆర్ విషయంలో మాత్రం ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చే పనిలో పడ్డారు. కీలక నేతల ప్రకటనలే ఇందుకు బలం చేకురుస్తున్నాయి.

ఈసారి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా వ్యూహన్ని మార్చేశాయి. నేరుగా కేసీఆర్ నే ఢీకొట్టాలని భావించాయి. ఇందులో భాగంగా…. బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని చెప్పారు. అందుకు బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి జాబితాలో రెండు చోట్ల ఈటల పేరు ఖరారైంది. గజ్వేల్ నుంచి ఈటల బరిలో ఉండటంతో….. ఇక్కడి పోరు అత్యంత ఉత్కంఠగా మారింది. కేసీఆర్ ను ఓడించటమే తన లక్ష్యమని ఈటల గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ భారీగా ముదిరాజ్ సామాజికవర్గ ఓట్లు ఉండటం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ఈటల భావిస్తున్నారు.

ఇక ఇటీవలే బీజేపీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… కాంగ్రెస్ లో చేరారు. మునుగోడులో పోటీ చేస్తానని చెప్పటంతో పాటు… పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే గజ్వేల్ బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ ను ఓడిస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్… మునుగోడులోనైనా సవాల్ చేయాలని అన్నారు. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై పోటీకి రెడీ అనేశారు. ఇకాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయటానికి సిద్ధమేనని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇలా ఎవరైనా సరే పార్టీ ఆదేశిస్తే వారిపై పోటీ చేస్తామని అన్నారు. ఇప్పటికే కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకు తగ్గటే రేవంత్ రెడ్డి…. వ్యాఖ్యలు చేయటంతో కామారెడ్డి బరి కూడా అత్యంత ఉత్కంఠను రేపుతోంది.

ఇదిలా ఉంటే ఈ రెండు చోట్ల పోటీపై గులాబీ పార్టీ వర్గాలు మరోలా స్పందిస్తున్నాయి. కేసీఆర్ ను ఢీకొట్టే స్థాయిలో రెండు పార్టీల అభ్యర్థులకు లేదని చెబుతున్నాయి. రెండు చోట్ల కేసీఆర్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పోటీ చేసే స్థానాలపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ నేప‌థ్యంలో గులాబీ బాస్ భారీ మెజార్టీతో గెలుస్తారా…? లేక ఏమైనా అద్భుతాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయా.. అనే ఉత్కంఠ ఏర్ప‌డింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =