ఇండిపెండెంట్‌గానే కేశినేని పోటీ..?

Can Keshine Contest As An Independent, Keshine Contest As An Independent, Can Keshine Contest, Kesineni Nani, Vijayawada MP, Telugu Desam Party, YCP, AP Politics, Latest Kesineni Nani News, Kesineni Nani Political News, CM Jagan, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Kesineni nani, Vijayawada MP, Telugu desam Party, YCP, AP Politics

కేశినేని నాని.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నికల వేళ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేశినేని ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పేసింది. ఇక కేశినేని నాని వైసీపీలో చేరుతారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కాషాయపు పార్టీలోకి వెళ్తారని.. లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ అసలు కేశినేని మనసులో ఏముంది?.. ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

గతంలోనే ఓసారి కేశినేనికి వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోకి కేశినేనిని అహ్వానించారట. అప్పుడు కేశినేని కూడా పార్టీ మారడం ఖాయమని వార్తలొచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఏమయిందో ఏమో కానీ టీడీపీలోనే ఉండిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి బీసీని ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ అనుకుంటోంది. ఆ స్థానం కోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.

అయితే కేశినేని నాని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తేనే తమకు ప్లస్ అవుతుందని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. నాని విజయవాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే తెలుగు దేశం పార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందని అనుకుంటోందట. ఈక్రమంలో కేశినేనిని తమ పార్టీలోకి తీసుకోవాలా.. వద్దా అనే దానిపై వైసీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తోందట.

అటు కేశినేని బీజేపీలోకి వెళ్దామనుకుంటే.. ఆ పార్టీ తెలుగుదేశం, జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2019లోనే ఒంటరిగా పోటీ చేసి బీజేపీ ఏపీలో దెబ్బతిన్నది. అందుకే ఈసారి ఎలాగైనా పొత్తు పొట్టుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే కేశినేని బీజేపీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏపీలో వరకు మళ్లీ చంద్రబాబు మాటే నెగ్గుతుంది కాబట్టి. అటు బీజేపీ నుంచి కూడా విజయవాడ ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడమే కరెక్ట్ అని కేశినేని భావిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 7 =