జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న అనంత‌రం..?

AP State political, Elections , Nominations , TDP vs YSRCP , CM Jagan ,
AP State political, Elections , Nominations , TDP vs YSRCP , CM Jagan ,

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌రంలో తెలుగుదేశం కూట‌మి, అధికార పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొన‌సాగుతోంది. ఎత్తుల‌కు పై ఎత్తుల‌తో అన్ని పార్టీలూ రాజ‌కీయాల‌ను ర‌క్తిక‌ట్టిస్తున్నాయి. నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైన త‌ర్వాత కూడా కూట‌మిలో సీట్ల సర్దుబాటు, మార్పులు-చేర్పులు కొన‌సాగాయి. చివ‌రి రోజుల్లో కొలిక్కి వ‌చ్చినా.., అసంతృప్తి పూర్తిగా చ‌ల్లార‌లేదు. ఈనేప‌థ్యంలో కొంద‌రు నాయ‌కులు వైసీపీ వైపు రూటు మ‌ర్చారు. తెలుగుదేశం లేదా జ‌న‌సేన త‌మ‌కు అన్యాయం చేసిందన్న క‌సితో అధికార  పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అలాంటి నేత‌ల‌ను జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేర్చుకుని ప్ర‌చారంలో వినియోగించుకుంటున్నారు. వైసీపీ గెలుపును ప‌టిష్టం చేసుకునేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు.

ఈక్ర‌మంలోనే ఇటీవ‌ల మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రమంతా బ‌స్సుయాత్ర నిర్వ‌హించారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిన్న ముగిసింది. మొత్తం 2,100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది.  86 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్‌.. 15 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. నిన్న అక్కవరంలో 16వ సభలో పాల్గొని తాడేపల్లికి బయలుదేరారు. ఈరోజు పులివెందులకు వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు. ఈ బ‌స్సు యాత్ర ద్వారా వైపీపీలోకి భారీగా చేరిక‌లు కొన‌సాగాయి. ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకులం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కూటమి నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్‌సీపీలో చేరారు. భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్వతీపురం నియోజకవ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హిళా క‌మిష‌న్ మాజీ స‌భ్యురాలు కొయ్యాన శ్రీ‌వాణి వైసీపీలో చేరారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్‌సీపీలో చేరారు. జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న అనంత‌రం ఇలా అధిక సంఖ్య‌లో టీడీపీ కూట‌మి నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌న్నీ పార్టీకి క‌లిసి వ‌స్తాయ‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించ‌డంతో ఉత్త‌రాంధ్ర వైసీపీకి జై కొడుతోంద‌ని, అందుకే విప‌క్షంలోని కొంద‌రు నేత‌లు అధికార పార్టీలోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =