ఏప్రిల్‌ 2022-మార్చి 2023 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్‌

AP CM YS Jagan Releases Welfare Calendar For the Period of April 2022 - March 2023, AP CM YS Jagan Releases Welfare Calendar, Welfare Calendar For the Period of April 2022 - March 2023, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Budget Session, AP Assembly Budget Session, Assembly Session 2022, AP Budget Session 2022, Budget Session, Andhra Pradesh Budget Session, AP Budget Session, 2022 AP Budget Session, AP Assembly Budget Session 2022-23, AP Assembly Budget Session 2022, AP Assembly Budget Session, AP Assembly Budget, Andhra Pradesh assembly budget session, AP Budget 2022-23, AP Budget 2022, AP Budget, Andhra Pradesh, Andhra Pradesh Assembly, AP Assembly, AP Assembly Session, Budget Session 2022, Mango News, Mango News Telugu,

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడారు. మరో రెండు నెలల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుందని, ఈ బడ్జెట్‌ కూడా మేనిఫెస్టోను పూర్తిగా ప్రతిబింబిస్తూ ఒక భగవద్గీతగా, బైబిల్‌ గా, ఖురాన్‌ గా భావిస్తూ, మేనిఫెస్టోను పూర్తిగా బడ్జెట్‌లోకి తీసుకుని వచ్చామని చెప్పారు. ఈ మూడు సంవత్సరాలలో అక్షరాలా 95 శాతం వాగ్ధానాలు అమలు చేయడంతో పాటుగా, నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ పరిపాలన సాగిందని సీఎం అన్నారు.

కరోనా వచ్చి ఆదాయాలు తగ్గినా కూడా సంకల్పం ఎక్కడా చెదరలేదు, ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గనూ లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఏ పథకం ఏ నెలలో అందించబోతుందో తెలియజేసే సంక్షేమ క్యాలెండర్‌ ను సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

ఏప్రిల్‌ 2022-మార్చి 2023 వరకు ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్‌:

  • ఏప్రిల్‌ 2022 – వసతి దీవెన, వడ్డీలేని రుణాలు
  • మే 2022 – విద్యా దీవెన, అగ్రి కల్చర్‌ ఇన్సూరెన్స్‌ (ఖరీఫ్-2022), రైతు భరోసా, మత్య్సకార భరోసా (బ్యాన్ సబ్సిడీ), మత్య్సకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
  • జూన్‌ 2022 – అమ్మ ఒడి పథకం
  • జూలై 2022 – విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు పెండింగ్‌ నిధుల విడుదల/జమ
  • ఆగష్టు 2022 – విద్యా దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ఇన్సెన్‌టివ్‌, నేతన్న నేస్తం
  • సెప్టెంబర్‌ 2022 – వైఎస్ఆర్ చేయూత
  • అక్టోబర్‌ 2022 – వసతి దీవెన, రైతు భరోసా
  • నవంబర్‌ 2022 – విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
  • డిసెంబర్‌ 2022 – ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పెండింగ్‌ నిధుల విడుదల/జమ
  • జనవరి 2023 – రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, పెన్షన్ పెంపు
  • ఫిబ్రవరి 2023 – విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు
  • మార్చి 2023 – జగనన్న వసతి దీవెన.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + three =