విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన: బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, సీఎం జగన్ ఆదేశాలు

Vijayawada Govt Hospital Molestation Incident CM Jagan Announces Rs 10 Lakh Ex-gratia to Victims Family, CM Jagan Announces Rs 10 Lakh Ex-gratia to Victims Family, Vijayawada Govt Hospital Molestation Incident, Govt Hospital Molestation Incident, 10 Lakh Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, Govt Hospital Molestation Incident In Vijayawada, Govt Hospital Molestation Incident, AP CM YS Jagan Announces 10 Lakh Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, 10 Lakh Ex-gratia, Ex-gratia to Vijayawada Govt Hospital Molestation Victims Family, Vijayawada Govt Hospital Molestation Incident News, Vijayawada Govt Hospital Molestation Incident Latest News, Vijayawada Govt Hospital Molestation Incident Latest Updates, Vijayawada Govt Hospital Molestation Incident Live Updates, Molestation Incident, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, AP CM, Mango News, Mango News Telugu,

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఎవరిని ఉపేక్షించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉండాలని, వెంటనే రూ.10లక్షల పరిహారం అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఇప్పటికే నున్నా సీఐ, సెక్టార్ ఎస్సైలపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఆసుపత్రిలో ఫాగింగ్, సెక్యూరిటీ ఏజెన్సీలకు టెర్మినేషన్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి శాఖాపరమైన దర్యాప్తును అధికారులు చేపడుతున్నారు. నివేదిక వచ్చాక సంబంధం ఉన్న మరికొందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బాధితురాలిని పరామర్శించేందుకు పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =