ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, మొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

Andhra Pradesh Inter Results, AP Inter 2020 Results, AP Inter Results, AP Inter Results 2020, AP Intermediate, AP Intermediate 2020 Results Released, AP Intermediate Results, AP Intermediate Results 2020, AP Intermediate-2020 Results, AP Intermediate-2020 Results Released Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలు https://bie.ap.gov.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ వెబ్‌సైట్ లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని చెప్పారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చ్ 4 నుంచి 23 వరకు జరిగాయి, కాగా కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో వాల్యుయేషన్ జరగకపోవడంతో ఫలితాల విడుదల ఆలస్యం అయింది. ఇటీవల లాక్‌డౌన్ అమలులో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తీ చేసి, ఈ రోజున ఫలితాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల నేపధ్యంలో కూడా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మొదటిగా ఫలితాలను విడుదల చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని చెప్పారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ నెలరోజులలోనే వాల్యూయేషన్‌ పూర్తి చేశామని అన్నారు. ఈ సంవత్సరం అన్ని గ్రూపులకు కలిపి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,65,155 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేయడం వలన మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు ప్రకటించనున్నామని, అలాగే రెండో సంవత్సరం ఫలితాలను సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌ పాయింట్లలో ప్రకటించనున్నామని చెప్పారు. షార్ట్‌ మార్కుల మెమోలను జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయని, విద్యార్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 11 =