వైసీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. విశాఖ దక్షిణ ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా

AP MLA Vasupalli Ganesh Kumar Resigns From Visakhapatnam South in-charge Post of YSRCP, MLA Vasupalli Ganesh Kumar Resigns From Visakhapatnam South in-charge Post of YSRCP, Vasupalli Ganesh Kumar Resigns From Visakhapatnam South in-charge Post of YSRCP, AP MLA Vasupalli Ganesh Kumar Resigns From Visakhapatnam, MLA Vasupalli Ganesh Kumar Resigns From YSRCP, Vasupalli Ganesh Kumar Resigns From YSRCP, AP MLA Vasupalli Ganesh Kumar, MLA Vasupalli Ganesh Kumar, Vasupalli Ganesh Kumar, Visakhapatnam South in-charge Post of YSRCP, YSRCP MLA, Visakhapatnam, YSRCP MLA Vasupalli Ganesh Kumar, YSRCP MLA Vasupalli Ganesh Kumar Resigns From Visakhapatnam South in-charge Post of YSRCP, Mango News, Mango News Telugu,

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్‌సీపీకి షాక్ ఇచ్చారు. విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు వాసుపల్లి గణేష్ ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు ఒక లేఖ రాశారు. లేఖలో ఆయన.. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనా దక్షతకు ఆకర్షితుడినై, వారి ఆహ్వానం మేరకు పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని ఒకవైపు తెలుపుతూనే.. మరోవైపు సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని, తనను బాధ పెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిపై మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి బద్ధుడినై నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి పాటుపడతానని వెల్లడించారు.

కాగా వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అధికార పార్టీకి దగ్గరగా మసలుతున్నారు. అలాగే తన కుమారులిద్దరినీ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేర్చారు. అనంతర పరిణామాలలో వైసీపీ అధిష్టానం ఆయనకు విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం ఈ పదవికే వాసుపల్లి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన కొందరు నేతల విషయంలో అధికారపార్టీకి చిక్కులు వస్తున్నాయి. చీరాలలో కరణం బలరాం, గన్నవరంలో వల్లభనేని వంశీ, తాజాగా వాసుపల్లి గణేష్ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది. కాగా వాసుపల్లి గణేష్ తిరిగి టీడీపీ లోకే వెళతారనే ప్రచారం వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =