మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా చిరంజీవి

Megastar Chiranjeevi, Chiranjeevi, Congress, Lok sabha elections, Revanth reddy, padma vibhushan, tirupathi, andhra pradesh, YCP, telugu actor chiranjeevi, tollywood, Telugu Political updates, Latest updates, Mango News Telugu, Mango News
Megastar Chiranjeevu, Chiranjeevi, Congress, Lok sabha elections, Revanth reddy

అంద‌రివాడు అంటూ.. ఎవ‌రి వైపు అనే ప్ర‌శ్న ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు రాజ‌కీయాల్లోకి రానంత వ‌ర‌కూ అంద‌రివాడిగానే.. అంద‌రూ అభిమానిస్తారు. సెల‌బ్రిటీలు.. ఏదైనా పార్టీలో చేరిన వెంట‌నే.. అప్ప‌టి వ‌ర‌కూ ఎంతో అభిమానించిన ప్ర‌తిప‌క్ష పార్టీ లోని కొంద‌రు నేత‌లు సైతం.. ఆ వ్య‌క్తిపై విమ‌ర్శ‌లు మొద‌లుపెడ‌తారు . మెగాస్టార్‌, ప‌ద్మ‌విభూష‌ణ్‌ చిరంజీవి అలాంటి అనుభ‌వాల‌ను ఎన్నో చూశారు. ఆయ‌న రాజకీయాల్లోకి రాక‌ముందు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కింగ్ మేక‌ర్ గా ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌తో స‌ఖ్య‌త కోరుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయంగానూ అంద‌రివాడిగా ముద్ర పొందారు. చిరంజీవి రాజ‌కీయ అరంగేట్రం చేసి పార్టీ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచీ ఆయ‌న‌ను చూసే ధోర‌ణిలో కొంద‌రిలో మార్పు మొద‌లైంది. ఇప్పుడు మ‌ళ్లీ అన్ని రాజ‌కీయ పార్టీలూ చిరంజీవిని ద‌గ్గ‌ర చేసుకునే ప‌నిలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

సినిమాల్లో మెగాస్టార్ గా ల‌క్ష‌లాది మంది అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బ్యాంక్‌.. వంటి ఎన్నో కార్య‌క్ర‌మాల ద్వారా రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న అంద‌రి అభిమానాలూ పొందారు. కానీ.. రాజ‌కీయాల్లో మాత్రం అంత‌గా రాణించ‌లేక‌పోయారు.  ఆయ‌న రాజకీయ రంగప్రవేశంపై 2007 నుంచీ తీవ్ర‌మైన స్థాయిలో చ‌ర్చ మొద‌లైంది. ఎంతో ఉత్కంఠ ఏర్ప‌డింది. చివ‌ర‌కు 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశాన్ని ప్ర‌క‌టించారు. అదే నెల‌లో తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించారు. సామాజిక న్యాయం పేరుతో తెర‌పైకి వ‌చ్చిన చిరంజీవి పార్టీ సంచ‌ల‌నంగా మారింది. విధి విధానాలు ఆక‌ట్టుకున్నాయి. కానీ.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అంత‌గా ఆద‌ర‌ణ చూప‌లేదు. 2009 లో జరిగిన ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ మొత్తం 295 స్థానాల్లోనూ పోటీ చేయగా 18 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. సీట్లు అమ్ముకున్నార‌న్న విమ‌ర్శ‌లు, రాజకీయంగా ఆరితేరిన నేత‌ల కుట్ర‌ల‌ను తిప్పికొట్ట‌లేక‌పోవ‌డం వ‌ల్ల ఓట‌మిని చ‌విచూశారు. చిరంజీవి సైతం పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, పాలకొల్లులో ఓడిపోయారు.

అనంత‌రం 2011లో ప్రజారాజ్యం పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు . 2012లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర మంత్రి కూడా కొన‌సాగారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు.2014 పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నాటి ప‌రిస్థితుల దృష్ట్యా చురుకైన పాత్ర పోషించ లేదు. ఆ త‌ర్వాత నుంచి కూడా చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయ‌న పదవీకాలం ఏప్రిల్ 2018లో ముగిసింది. అనంత‌రం 2022లో చిరంజీవికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గుర్తింపు కార్డు కొత్త‌గా జారీ చేయ‌డంతో మ‌రోసారి రాజకీయ పునరాగమనంపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఏ పార్టీకి ప్ర‌చారం చేయ‌లేదు. ఎందులోనూ చేర‌లేదు.

నేను రాజ‌కీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ, రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు.. అని ఓ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ మాదిరిగానే.. నిజ‌జీవితంలోనూ కొన‌సాగుతోంది. లోక్ స‌భ‌, ఏపీ లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆ త‌ర‌హా ప‌రిణామాలు ఇటీవ‌ల ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు చిరంజీవిని ఎక్కువుగా క‌లుస్తున్నారు. ప్ర‌భుత్వ, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు సైతం ఆయ‌న‌కు ఆహ్వానాలు పంపుతున్నారు. అయోధ్యలో రెడ్ కార్పెట్‌, హైద‌రాబాద్ లో జ‌రిగిన గోల్కొండ లైటింగ్ ప్రారంభోత్స‌వం, ఇటీవ‌ల ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌ట‌న‌.. ఇలా ప‌లు విధాలుగా చిరంజీవికి ప్రాముఖ్య‌త ఇస్తోంది బీజేపీ. అలాగే కాంగ్రెస్ నాయ‌కులు  కూడా చిరంజీవి ఇప్ప‌టికీ త‌మ వాడే అని చెప్పుకుంటున్నారు. ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుకు ఎంపికైన సంద‌ర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాస‌న ఏర్పాటు చేసిన విందుకు రేవంత్ రెడ్డి హాజ‌రై చిరంజీవి కుటుంబ‌స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

కాగా.. ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల స‌త్కార కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడటం సరికాదని అన్నారు చిరంజీవి. వ్యక్తిగత దూషణలు చేసే వారిని ప్రజలే తిరస్కరించాలని సూచించారు. అవార్డు లు ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సత్కరించటం అనేది నిజంగా ఆనందం. డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి వల్లనే ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఇప్పటివరకు నంది అవార్డులు నామమాత్రంగా నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించి నంది అవార్డు పేరు ప్రజా యుద్ధ నూక గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా ఆనందం… అంటూ రేవంత్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ఈ అంశాల‌న్నీ ప‌రిశీలిస్తే.. మ‌రోసారి రాజ‌కీయంగా చిరంజీవి చ‌ర్చ‌నీయాంశం అవుతున్నారు. ఆయ‌న మాత్రం గెట్ రెడీ.. అంటూ విశ్వంభ‌ర మూవీ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − thirteen =