నేడు గుంటూరు జిల్లాలో పర్యటన చేయనున్న సీఎం జగన్‌

Aasara pensions, AP Government Increases Social Security Pension To Rs 2500, AP govt hikes YSR Pension Kanuka, AP Govt Pension Scheme, AP Pension, AP Pension Scheme, Chief Minister of Andhra Pradesh, distribution of hiked pension, Home Minister of Andhra Pradesh, Mango News, Old Age Pension, Pension Hike, Pension Scheme, YS Jagan About YSR Pension Scheme, ys jagan mohan reddy, YS Jagan Mohan Reddy To Visit Guntur, YS Jagan Mohan Reddy To Visit Guntur On January 1 To Launch Hike In Pension Scheme, YSR Pension Scheme, ysr pension scheme latest news

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ వివరాలను సీఎంఓ బుధవారం ఖరారు చేసింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. దీనికి సంబంధించి వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగలా చేసేందుకు.. తగిన ఏర్పాట్లు చేయాలని హోం మంత్రి సుచరిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో  హెలిప్యాడ్‌ స్థలం, వాహనాల పార్కింగ్, సభాప్రాంగణం ఏర్పాట్లను హోం మంత్రితో పాటు ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల అనంతరం హోంమంత్రి, ఎమ్మెల్సీలు మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుండాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడులో నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యుత్‌కు అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని,  అధికారులకు ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =