సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

CM YS Jagan Held Review Meet on Department of Higher Education Gives Green Signal For Filling Vacant Posts,CM YS Jagan Held Review Meet,Department of Higher Education, Gives Green Signal For Filling Vacant Posts,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి సహా విద్యాశాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఉన్నత విద్యాశాఖపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని గుర్తించి జూన్ నాటికి నియామక ప్రక్రియ చేపట్టాలి.
  • దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న కేసులపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించుకోవాలి.
  • ట్రిపుల్ ఐటీలలో కూడా సిబ్బంది నియామకం సహా ఇతర పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలి.
  • అలాగే ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నాక్ అక్రిడిటేషన్ సాధించాలి.
  • దీనికోసం ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ వచ్చే మూడేళ్ళలో ప్రమాణాలు అందుకోవాలి.
  • ఒకవేళ నాక్ అక్రిడిటేషన్ సాధించలేని పక్షంలో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి.
  • ఇక కాలేజీలలో వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యతను స్కిల్ యూనివర్సిటీకి అప్పగిస్తున్నాం.
  • దీనికోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
  • కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టి విద్యార్థులకు సంబంధిత శిక్షణ అందించాలి.
  • ప్రధానంగా బోధనా సిబ్బంది సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్ స్టాఫ్ కాలేజీ తరహాలో సెంట్రల్ ఆంధ్రా పరిధిలో మరో స్టాఫ్ కాలేజీ ఏర్పాటు చేయాలి.
  • అమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా స్కూల్స్ మరియు కాలేజీలలో డ్రాపౌట్స్ ను నిరోధించాలి.
  • అలాగే స్వయం ఉపాధిని కల్పించే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, రిస్క్ ఎనాలిసిస్, రిస్క్ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి కోర్సులపై దృష్టి పెట్టి వచ్చే ఏడాదికి పాఠ్యాంశాలుగా అందించాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =