ఆర్థికపరమైన సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం – సీఎస్ శాంతి కుమారి

CS Santhi Kumari Chairs State Level Consultative Committee Meeting on Economic Related Cyber Crimes,CS Santhi Kumari,Chairs State Level Consultative,State Level Consultative Committee Meeting,Economic Related Cyber Crimes,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణకై పోలీస్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు. గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం (ఎస్ఎల్సీసీ) సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాన్ బ్యాంకింగ్ ఆర్ధిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలు, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, డిపాజిట్ ల సేకరణ తదితర అంశాలలో ప్రజల నుండి అందిన ఆర్ధిక లావాదేవీల ఫిర్యాదులు, వాటిపై న్యాయ స్థానాలలో నమోదైన కేసులను సమీక్షించారు.

ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, నాన్ బ్యాంకింగ్ తరహా లోన్ యాప్ ల ద్వారా మోసపూరిత కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నందున, ఈ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తత చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థిక పరమైన నేరాలకు సంబందించిన ఫిర్యాదులు పోలీస్ యంత్రాంగం దృష్టికి వచ్చిన వెంటనే, వాటిపై చర్యలకు తక్షణమే ఉపక్రమించాలని సీఎస్ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ సైబర్ ఆధారిత నేరాల నిరోధంపై ప్రజలను చైతన్య పరచడంతోపాటు అవగాహన చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ కె.నిఖిల, ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ రుచి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజీ రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రాష్ట్ర సీఐడి విభాగం డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ సుమిత్ర, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =