ఎల్లుండి విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే..!

CM YS Jagan To Visit Vizianagaram and Visakhapatnam on May 3 The Complete Schedule Follows as Here,CM YS Jagan To Visit Vizianagaram,CM YS Jagan To Visit Visakhapatnam,CM YS Jagan Visakhapatnam Visit on May 3,The Complete Schedule Follows as Here,Mango News,Mango News Telugu,CM Jagan to launch slew of works in Vizag,CM Jagan Tour in Vizianagaram and Vizag,CM Jagan Vizianagaram and Vizag Tour Schedule,AP CM YS Jagan Latest News and Updates,Extensive arrangements made ahead,CM Jagan Vizag Tour Latest News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మే 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్‌ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన, చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే విశాఖపట్నం లోని మధురవాడలో నూతనంగా నిర్మిస్తున్న వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంఓ అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు.

సీఎం జగన్ విజయనగరం పర్యటన షెడ్యూల్..

  • మే 3 ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 10.25 గంటలకు జీఎంఆర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌కు చేరుకొని సందర్శిస్తారు.
  • ఉదయం 10.30 గంటలకు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు.
  • దీనితో పాటుగా చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌లో మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు.
  • ఉదయం 10.55 గంటలకు సవరవిల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.
  • సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం జగన్ విశాఖపట్నం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.

సీఎం జగన్ విశాఖపట్నం పర్యటన షెడ్యూల్..

  • మే 3న మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నంబర్‌ 3 వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు ఐటీ హిల్స్‌ నంబర్‌ 4లో గల వేదిక వద్దకు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 2.30 -3.00 గంటల మధ్య వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
  • ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శిస్తారు.
  • అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు.
  • ఆ తర్వాత 3.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రుషికొండలోని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు.
  • అక్కడ ఇటీవలే వివాహం జరుపుకున్న ఎంపీ కొడుకు దంపతులను ఆశీర్వదించారు.
  • అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 5.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • విశాఖపట్నంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =