సిరియాలో ఇస్లామిక్ స్టేట్ చీఫ్‌ హతం.. ధృవీకరించిన టర్కీ అధ్యక్షుడు ట‌య్యిప్ ఎర్డోగాన్‌

Turkish President Tayyip Erdogan Announces ISIS Chief Abu Hussein Al-Qurashi Assassinated by Their Intelligence Forces in Syria,Turkish President Tayyip Erdogan,Tayyip Erdogan Announces ISIS Chief Abu Hussein Al-Qurash,Al-Qurashi Assassinated by Their Intelligence Forces in Syria,ISIS Chief Abu Hussein Al-Qurashi,Mango News,Mango News Telugu,ISIS Leader Abu Hussein Al-Qurashi killed,Suspected ISIS chief,Turkish forces kill Islamic State chief in Syria raid,Suspected ISIS Chief Killed In Syria,Islamic State leader killed in Syria,ISIS Chief Abu Hussein Latest News,Turkish President Tayyip Erdogan Latest Updates,Syria Intelligence Forces News Today

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా (ఐసిస్) చీఫ్ అబు హుస్సేన్ అల్ ఖురేషీ హతమయ్యాడు. అతడిని తమ ఇంటెలిజెన్స్ బృందం మ‌ట్టుబెట్టిన‌ట్లు ట‌ర్కీ అధ్యక్షుడు ట‌య్యిప్ ఎర్డోగ‌న్ ప్ర‌క‌టించారు. సిరియాలో టర్కిష్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ఎంఐటీ) చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా అబు హుస్సేన్ అల్ ఖురేషీ తారసపడగా.. అతడిని ఏజెన్సీ మట్టుబెట్టినట్లు తెలిపారు. కాగా చాలాకాలంగా టర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐసిస్ చీఫ్ కోసం రహస్యంగా వెతుకుతోంది, ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శ‌నివారం ఈ ఆప‌రేష‌న్ జ‌రిగిన‌ట్లు ఆయన నిర్ధారించారు. ‘ఎలాంటి వివక్ష లేకుండా ఉగ్రవాద సంస్థలతో తమ పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఈ సందర్భంగా ఎర్డోగన్ ఉద్ఘాటించారు.

ఇక ఆఫ్రిన్ యొక్క వాయువ్య ప్రాంతంలోని జిండిరెస్ అనే పట్టణంలో ఈ ఆపరేషన్ జరిగిందని, టర్కీ ఇంటెలిజెన్స్ మరియు భద్రతా దళాలు ఇస్లామిక్ పాఠశాలగా ఉపయోగించబడుతున్న పాడుబడిన పొలాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. కాగా అబూ హసన్ అల్-హషిమీ మరణించిన తర్వాత ఐసిస్ తమ నాయకుడిగా అల్-ఖురేషీని నియమించింది. 2022 నవంబర్‌లో దక్షిణ సిరియాలో జరిగిన యూఎస్ ఆపరేషన్‌లో అల్-హషిమీ హతమయ్యాడు. అంతకుమునుపు 2014లో, ఐసిస్ తొలి అధ్యక్షుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ ఆధ్వర్యంలో ఇరాక్ మరియు సిరియా దేశాలలో అనేక కీలక ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుని ఇస్లామిక్ కాలిఫేట్‌ను ప్రకటించింది. 2019లో అమెరికా జరిపిన ఆపరేషన్‌లో బాగ్దాదీ హతమయ్యాడు. కుర్దిష్ నేతృత్వంలోని కూటమి అయిన సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)తో పాటు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యాలు ఐసిస్ సేనలపై యుద్ధం చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eleven =