ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ‌పంపాలని విజ్ఞప్తి

CM YS Jagan Writes to PM Modi, CM YS Jagan Writes to PM Modi Urges to Send 60 Lakh Corona Vaccine Doses, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination Distribution, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution News, Distribution For Covid-19 Vaccine, India Covid Vaccination, Mango News, PM Modi, PM Modi Urges to Send 60 Lakh Corona Vaccine Doses, Vaccine Distribution, YS Jagan

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి శుక్రవారం నాడు లేఖ రాశారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వచ్చే మూడు వారాల్లో మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు గానూ 60 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులు అవసరమని, ఈ మేరకు వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులకు సూచించాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. అలాగే తన లేఖకు ప్రతిస్పందనగా ఏప్రిల్ 9న 6.4 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను ఏపీకి పంపినందుకు ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు టీకా ఉత్సవ్ లో భాగంగా ఏప్రిల్ 14, బుధవారం ఒక్కరోజే 6,28,961 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక రోజుకు ఆరు లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేసే సామర్థ్యాన్ని స్థాపించడమే కాకుండా, అన్ని రాష్ట్రాలకు అనుకరించడానికి ఒక నమూనాను ఏర్పాటు చేసామన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా అయిపోయినందున ఈ డ్రైవ్‌ను కొనసాగించలేకపోయామని చెప్పారు. వ్యాక్సిన్ నిల్వలు తగినంతగా అందుబాటులోకి వస్తే రాబోయే మూడు వారాల్లో అర్హులైన ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =