‘‘గ్యారెంటీ’’గా గెల‌వాల‌ని కాంగ్రెస్ త‌హ‌త‌హ‌!

Congress Wants To Win As A
AP State elections , TDP , Jana Sena , YCP ,BJP

ఐదు గ్యారెంటీల పేరుతో క‌ర్ణాట‌కలో.. ఆరు గ్యారెంటీల‌తో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన  కాంగ్రెస్ పార్టీ.. ఆ ఫార్ములాను ఇక దేశవ్యాప్తంగా ఉప‌యోగించాల‌నే యోచ‌న‌తో ఉంది. యాత్ర‌ల ద్వారా రాహుల్ గాంధీ పార్టీలో జోష్ పెంచుతున్న‌ప్ప‌టికీ.. దేశంలో మోదీ హ‌వాను అడ్డుకునే స్థితి రాలేద‌ని ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. 400+ అంటూ దేశ‌మంతా ప్ర‌ధాని మోదీ విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామ‌నే ధీమాతో క‌మ‌ళ‌ద‌ళాదిప‌తులు ఉన్నారు. కానీ.. ఇప్పుడైనా గెలుస్తామ‌న్న ధీమా కాంగ్రెస్ నేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. ఈక్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం ద్వారా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈనేప‌థ్యంలోనే ఇంటింటికీ గ్యారెంటీ పేరిట కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో రూపొందించింది.  మోదీ గ్యారెంటీలకు దీటుగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ‘ఐదు న్యాయాల’కు తుది రూపు ఇచ్చింది. ‘ఇంటింటికీ గ్యారెంటీ’ పేరిట రూపొందించిన ఐదు న్యాయాల్లో 25 హామీలను గుదిగుచ్చింది. పి.చిదంబరం నేతృత్వంలోని మ్యానిఫెస్టో కమిటీ రూపొందించిన ఐదు హామీలకు అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది. ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు.. విద్యావంతులైన యువతకు ఒక ఏడాదిపాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల అప్రెంటిస్‌షిప్‌.. రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ తొలగింపు.  ఉపాధి హామీ సహా దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజుకు రూ.400.. శాశ్వత రుణ మాఫీ కమిషన్‌ ఏర్పాటు వంటివెన్నో అందులో పొందుప‌రిచింది.

మ్యానిఫెస్టోపై సీడబ్ల్యూసీ కూలంకషంగా చ‌ర్చించి మ‌రీ ఓకే చేసింది. దేశం మార్పును కోరుకుంటోందని, భావిస్తున్న కాంగ్రెస్.. గ్యారెంటీల ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మ్యానిఫెస్టోకు వివిధ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం లభించేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, నిబద్ధతతో ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని కార్య‌క‌ర్త‌ల‌ను కోరారు. ఇది మ్యానిఫెస్టో మాత్రమే కాదని, ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పించేలా రూపొందించిన ‘న్యాయ పత్రమ’ని నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. ఐదు న్యాయాలు, పాతిక గ్యారెంటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెబుతున్నారు. గ్యారెంటీల‌తో గెలుపును వ‌రించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్‌కు ఎంత మంది గ్యారెంటీగా ఓట్లు వేస్తార‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =