ఏపీలో నాలుగు విడతల్లో కలిపి 2196 పంచాయతీ ఏకగ్రీవం, నాలుగో విడతలో 553 …

Andhra Pradesh Government, Andhra Pradesh panchayat elections, AP Fourth Phase Panchayat Elections, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections News, AP Grama Panchayat Elections 3rd Phase, AP Local Body Polls, AP Panchayat polls, AP Panchayat polls 2021, AP Political Updates, AP Third Phase Panchayat Elections, AP Third Phase Panchayat Elections Polling, Fourth Phase Panchayat Elections In AP, Mango News, Panchayat polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాల జోరు కొనసాగింది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3299 పంచాయతీలకు, ఆ పంచాయతీల పరిధిలోని 33,435 వార్డులకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 16 తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో పంచాయతీల ఏకగ్రీవాలపై స్పష్టత వచ్చింది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 553 పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఏకగ్రీవంగా అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నాడు వెల్లడించింది.

అలాగే 10,921 వార్డులకు కూడా ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు తెలిపారు. రెండు పంచాయతీలకు, 92 వార్డులకు నామినేషన్స్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,744 పంచాయతీలకు, 22,422 వార్డులకు ఫిబ్రవరి 17 న పోలింగ్ నిర్వహించనున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 153, అత్యల్పంగా కృష్ణా జిల్లాల్లో 13 పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా రాష్ట్రంలో నాలుగు విడతల్లో కలిపి 2196 పంచాయితీలు, 47463 వార్డులు ఏకగ్రీవమైనట్టు ప్రకటించారు.

నాలుగు విడతల్లో పంచాయితీల ఏకగ్రీవాల (2196) వివరాలు:

  • మొదటి విడత: 525
  • రెండో విడత : 539
  • మూడో విడత : 579
  • నాలుగో విడత : 553

నాలుగో విడతలో జిల్లాలవారీగా పంచాయతీల ఏకగ్రీవాల వివరాలు:

  • కృష్ణా – 13
  • గుంటూరు – 27
  • ప్రకాశం – 40
  • నెల్లూరు – 55
  • తూర్పుగోదావరి – 14
  • పశ్చిమగోదావరి – 29
  • వైఎస్ఆర్ కడప – 108
  • అనంతపురం – 0
  • చిత్తూరు – 153
  • కర్నూల్ – 27
  • శ్రీకాకుళం – 15
  • విశాఖపట్నం – 14
  • విజయనగరం – 58
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =